Movies

జాక్వెలీన్ ఈజ్ క్వీన్

the-queen-of-indian-tiktok-is-jacqueline-fernandez

ప్రస్తుతం యువతలో అత్యంత ఆదరణ ఉన్న యాప్స్‌లో టిక్‌టాక్‌ ఒకటి. ఈ యాప్‌లో రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయిన వాళ్లూ ఉన్నారంటే ఆశ్చర్యపోనవసరంలేదు. అలా టిక్‌టాక్‌ వీడియోలో కనిపించి 2019 ‘టిక్‌టాక్‌ ఇండియా క్వీన్‌’గా అవతరించింది బాలీవుడ్‌ నటి జాక్విలీన్‌ ఫెర్నాండజ్‌. ‘సాహో’ చిత్రంలో ‘బ్యాడ్‌ బాయ్‌’ అంటూ సాగే ప్రత్యేక గీతంలో ప్రభాస్‌ సరసన ఆడిపాడిన సంగతి తెలిసిందే. తాజాగా టిక్‌టాక్‌ రైవైండ్‌ 2019 ప్రచారంలో భాగంగా మొదటి యాభై కంటెంట్‌ వీడియోల జాబితా విడుదల చేసింది. అందులో బాలీవుడ్‌ నటి జాక్విలీన్‌ అత్యధిక ఫాలోవర్స్‌తో మొదటి స్థానం సంపాదించింది. 2019 ఇండియా టిక్‌టాక్‌ క్వీన్‌గా అవతరించింది. జాక్విలిన్‌ 9.5 మిలియన్ల ఫాలోవర్లతో బాలీవుడ్‌లో అగ్రస్థానంలో నిలవగా, ఆ తరువాత రితేష్‌ దేశ్‌ముఖ్‌ (6.8 మిలియన్స్) కపిల్‌ శర్మ (2.2 మిలియ్‌న్స్‌), మాధురీ దీక్షిత్‌(1.2 మిలియన్స్‌)లు అత్యధక మంది ఫాలోవర్లు కలిగి ఉన్నారు. జాక్విలీన్‌ హాట్‌ హాట్‌ బికినీలతోనే కాదు టిక్‌టాక్‌లోనూ తనదైన శైలితో అభిమానులను సంపాదించుకుంది.