శీతాకాలం అంటే శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే కాలం. ముఖ్యంగా ఆస్తమా ఇబ్బంది పెట్టే కాలం ఇది. ఉపశమనం కోసం ఈ ముద్రని వేయండి. రెండు అర చేతులు ఎదురెదురుగా ఉంచి మధ్య వేళ్ల గోళ్లను కలిపి, మడిచి నొక్కి పెట్టి ఉంచాలి. మిగతా వేళ్లు అన్నీ నిటారుగా పెట్టాలి. కళ్లు మూసుకుని వెన్నెముక నిటారుగా ఉంచి ఐదు నిమిషాల పాటు చేయాలి. ఈ ముద్ర సూర్యోదయం వేళ ఆ కిరణాలు మీద పడేలా కూర్చుని చేస్తూ, శ్వాసపై దృష్టి పెట్టాలి. ప్రతిరోజూ ఐదు నిమిషాలపాటు ఐదుసార్లు వేయడం వల్ల ఆస్తమా నియంత్రణలో ఉంటుంది. – అరుణ, యోగా నిపుణురాలు
అస్తమాను అంతం చేసే యోగముద్ర
Related tags :