ఏపీ సీఎం జగన్‌తో 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్.కె.సింగ్ నేతృత్వంలోని బృందం సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 2 గంటలపాటు ఈ భేటీ కొనసాగింది. రాష్ట్రానికి కేంద్రం అందిస్తోన్న ఆర్థిక సాయాన్ని పెంచాలని 15వ ఆర్థిక సంఘాన్ని సీఎం కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి తగు సాయం చేయాలని జగన్ వారికి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఓ నివేదికకు ఆయన అందజేశారు. విభజనతో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని నివేదికలో పేర్కొన్న సీఎం.. విభజన చట్టం హామీల మేరకు రాష్ట్రానికి కేటాయింపులు చేయాలని కోరారు.
ఏపీని ఆదుకోవల్సిందిగా జగన్ విజ్ఞప్తి
Related tags :