సీఎం సొంత జిల్లాలోని జమ్మలమడుగులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
తొలి నుండి వైయస్ కుటుంబానికి విధేయులుగా ఉంటూ..
2014 ఎన్నికల్లోనూ వైసీపీ నుండి గెలిచి ఆ తరువాత టీడీపీ లోకి వెళ్లి మంత్రి అయిన ఆదినారాయణరెడ్డి కుటుంబం ఇప్పుడు తిరిగి జగన్ వైపు చూస్తోంది.
మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరులు వైసీపీలో చేరటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
కొద్ది రోజుల క్రితం ఆది బీజేపీలో చేరారు. అయితే, ఇప్పుడు ఆయన సోదరులు జగన్ తో కలిసి తిరిగి రాజకీయంగా నడవాలని భావిస్తున్నారు.
అందుకోసం వైసీపీలో చేరేందుకు ఈ నెల 23న ముహూర్తం ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
అయితే, అక్కడ టీడీపీ నేత రామసుబ్బారెడ్డి సైతం వైసీపీతో టచ్ లో ఉన్నారనే ప్రచారం సాగుతున్న పరిస్థితుల్లో..
వీరు ముందడుగు వేసినట్లుగా నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది.
సీఎం కడప జిల్లా పర్యటనలో వీరు వైసీపీలో చేరటం దాదాపు ఖాయమైంది.