‘చాగంటి కోటేశ్వరరావు గొప్ప ప్రవచనకర్త. ఆయన మానవ జాతికి దొరికిన మణిపూస’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో చాగంటి కోటేశ్వరరావు భాగవత సప్తాహం ముగింపు కార్యక్రమానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చాగంటిని కేసీఆర్ శాలువాతో సన్మానించారు. ‘నాకు కూడా భాగవత సప్తాహం వినాలని కోరిక. భగవంతుని గురించి చదివినా, విన్నా గొప్ప పుణ్యం లభిస్తుంది. గజేంద్రమోక్షం లాంటి ఘట్టాలు చాలా సందర్భాల్లో కనిపిస్తాయి. భగవంతుని కరుణ మనకు కలగాలంటే లీనమై వినాలి. చాగంటిని గౌరవిస్తే మనకు మనం గౌరవించుకున్నట్టే. డొక్కా సీతమ్మ దంపతులది ఉదాత్తమైన లక్షణం. ఆధ్యాత్మికత అలవరచుకుంటే శాంతి, సౌభాగ్యం లభిస్తుంది. రోజురోజుకు మానవ ప్రవృత్తి మారుతోంది. ఎక్కడకెళ్లినా రాని క్రమశిక్షణ గుడికెళ్తే వస్తుందని’ కేసీఆర్ తెలిపారు.
చాగంటికి కేసీఆర్ సన్మానం
Related tags :