Movies

స్నేహితులు…సరదాలు

Kriti Sanon Speaks Of Her Free Time Activities

ఈ ఏడాది క్షణం తీరిక లేకుండా విసుగు విరామం లేకుండా పనిచేస్తోంది బాలీవుడ్‌ నటి కృతి సనన్‌. ప్రస్తుతం కృతి ‘మిమి’ అనే చిత్రంలో నటిస్తోంది. సినిమా ఇప్పటికే నలభై శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఇక రెండో షెడ్యూల్‌ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించనున్నారని సమాచారం. ఈ విరామ సమయంలో ఏం చేస్తారని కొంతమంది మీడియా మిత్రులు అడగ్గా? అందుకు కృతి స్పందిస్తూ.. ‘‘చాలా కాలంగా సినిమాల్లో బిజీగా ఉంటూ కుటంబంతో సభ్యులతో సరైన సమాయాన్ని కేటాయించలేక పోయా. ప్రస్తుతం ‘మిమి’ చిత్రంలో షూటింగ్‌ సుమారు నలభై శాతం పూర్తయింది. ఇక రెండో షెడ్యూల్‌ మొదలు పెట్టే వరకు కుటుంబ సభ్యులతో, నా స్నేహితులతో, ఇష్టమైన పనులు చేస్తూ సరదగా గడుపుతా’’ అని చెబుతోంది. సరోగసి నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘మిమి’ చిత్రానికి లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మడోక్‌ ఫిల్మ్స్, జియో స్టూడియో సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి దినేష్‌ విజ్జన్‌ నిర్మాత. కృతి ససన్‌ కథానాయికగా నటించి ఆరు చిత్రాలు ఈ ఏడాదిలో తెరపైకి వచ్చి అలరించాయి. కృతి ససన్‌ తెలుగులో ‘1: నేనొక్కడినే’, ‘దోచేయ్‌’ చిత్రాల్లో నటించింది.