Fashion

ముగ్గులు…చీరలెక్కితే…

Muggulu On Sarees-Telugu Fashion News Tips

గుమ్మం ముందు రంగవల్లిక సంప్రదాయ చీర కట్టుపైన మెరుస్తోంది. చీరకు అందాన్ని పెంచే జాకెట్టు పైన కొలువుదీరుతోంది. ఆ ముగ్గు ఈ ధనుర్మాసాన సరికొత్తగా ముస్తాబు అవుతోంది. ముంగిట ముగ్గుల అలంకరణే కాదు ముచ్చట గొలిపే ఆ ముగ్గు డిజైన్లతో ఉన్న చీరలను కట్టండి. ముగ్గులే కట్టారా అనిపించండి.

* ప్లెయిన్‌ కాటన్‌ చీర మీద ముగ్గుల ప్రింటు, ఆ చీరను కట్టుకున్నవారిని చూస్తే ముగ్గు కొత్త భాష్యం చెబుతున్నట్టుగా ఉంటుంది.
►తెలుగింటి ముగ్గు పట్టు చీర బ్లౌజ్‌కు ఎంబ్రాయిడరీగా అమరితే వేడుకలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది.
►కొత్తగా ముగ్గు డిజైన్‌ వేయించుకోవాలనుకునే ప్లెయిన్‌ చీర, బ్లౌజ్, డ్రెస్సులను ఎంచుకోవచ్చు. ఈ డిజైన్‌ బాగుండాలంటే చుక్కల ముగ్గునే ప్రింట్‌గా వేయించుకోవాలి. లేదా చేతి కుట్టుతో అందంగా రూపుకట్టాలి. అప్పుడే అల్లిక స్పష్టంగా తెలిసి అందంగా కనపడుతుంది. ముగ్గు డిజైన్‌ కావాలనుకుని సాధారణ డిజైన్‌ని ఎంచుకుంటే ఎలాంటి ప్రత్యేకతా ఉండదు
►చలికాలం తెలుగునాట ముగ్గుల కాలం కూడా కాబట్టి ఇప్పటికే ఇలాంటి డిజైన్స్‌తో ఉన్న చీరలను, డ్రెస్సులను ధరిస్తే సంప్రదాయానికి చిరునామాగా, కళగా కనపడతారు.

Image result for muggulu designs on sarees

Image result for muggulu designs on sarees

Image result for muggulu designs on sarees

Image result for muggulu designs on sarees

Image result for muggulu designs on sarees