DailyDose

ఉన్నావ్ రేపిస్టుకు జీవితఖైదు-నేరవార్తలు-12/20

Unnav Rapist MLA Sentenced To Life-Telugu Crime News-12/20

* జామా మ‌సీదు ఆందోళ‌న‌కారుల‌తో కిక్కిరిసిపోయింది. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌కారులు భారీ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ కూడా ఈ నిర‌స‌న‌లో పాల్గొన్నారు. వాస్త‌వానికి ఆయ‌న‌కు పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌లేదు. కానీ ఆయ‌న రాజ్యాంగానికి చెందిన ఓ కాపీతో ప్ర‌ద‌ర్శ‌న‌కు హాజ‌ర‌య్యారు. భారీ సంఖ్య‌లో ఆందోళ‌న‌కారులు ఆయ‌న్ను చుట్టుముట్టారు. శాంతియుతంగా ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టాల‌ని పోలీసులు ఇప్ప‌టికే వార్నింగ్ ఇచ్చారు. డ్రోన్ల ద్వారా పోలీసులు ప‌రిస్థిని స‌మీక్షిస్తున్నారు. ఢిల్లీ పోలీసు పీఆర్వో ఎంఎస్ రాంధ‌వా .. ఆందోళ‌న‌కారుల‌తోనే ఉన్నారు. ప్ర‌ద‌ర్శ‌న ముగిసినా అందరూ శాంతియుతంగా వెళ్లిపోవాల‌ని రాంధ‌వా పిలుపునిచ్చారు.

* ఉన్నావ్ అత్యాచార కేసులో దోషిగా తేలిన యూపీకి చెందిన బీజేపీ బ‌హిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు జీవిత‌ఖైదు శిక్ష‌ను విధించారు. ఐపీసీలోని సెక్ష‌న్ 376(2) ప్ర‌కారం శిక్ష‌ను ఖ‌రారు చేశారు. బాధితురాలికి స‌రైన ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోర్టు సీబీఐని ఆదేశించింది. 2017లో ఎమ్మెల్యే కుల్దీప్ ఓ యువ‌తిని రేప్ చేసిన కేసులో ఢిల్లీ కోర్టు ఈ తీర్పునిచ్చింది. సెంగార్‌కు వీలైనంత భారీ శిక్ష వేయాల‌ని సీబీఐ కోర్టును కోరిన విష‌యం తెలిసిందే. జిల్లా జ‌డ్జి ధ‌ర్మేశ్ శ‌ర్మ ఈ కేసులో ఇవాళ తుది తీర్పును వెలువ‌రించారు. మాజీ ఎమ్మెల్యే సెంగార్‌పై 25 ల‌క్ష‌ల జ‌రిమానా కూడా జ‌డ్జి విధించారు. ప‌ది ల‌క్ష‌లు బాధితురాలికి, 15 ల‌క్ష‌లు ప్రాసిక్యూష‌న్‌కు ఇవ్వాల‌ని కోర్టు చెప్పింది. సోమవారం రోజు కోర్టు సెంగార్‌ను దోషిగా తేల్చినా.. శిక్ష‌ను వాయిదా వేసింది. ఈ కేసులో మరో నిందితుడైన శశి సింగ్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించిన విష‌యం తెలిసిందే. సోమ‌వారం రోజున సెంగార్‌ను దోషిగా ప్రకటించడంతో.. ఆయన కోర్టు హాలులోనే బోరున విలపించారు. పోక్సో చట్టంలోని సెక్షన్‌ 5(సీ) మరియు ఐపీసీ 376 సెక్షన్‌ కింద సెంగార్‌ను దోషిగా నిర్ధారించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లక్నో కోర్టు నుంచి ఢిల్లీ కోర్టుకు కేసును బదిలీ చేశారు. ఈ కేసు ఢిల్లీ కోర్టుకు ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన బదిలీ కాగా, నాటి నుంచి రోజు వారీ విచారణ చేపట్టారు. 16 ఏళ్ల అమ్మాయిపై ఎమ్మెల్యే కుల్దీప్ 2017, జూన్ 4న ఉన్నావ్‌లో రేప్ చేశాడు.

* వికారాబాద్: జిల్లాలోని పరిగి మండల రెవెన్యూ కార్యాలయం డిప్యూటీ తహసీల్దార్ వాజేశ్ అవినీతి నిరోదక శాఖ అధికారులకు చిక్కాడు. రైతు భూమి పట్టా చేయడానికి వాజేశ్ రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు తహసీల్దార్ కార్యాలయంలో మాటు వేసిన ఏసీబీ సిబ్బంది రైతు నుంచి వాజేశ్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని, ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

* పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో భారీ ఎత్తున నిర‌స‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇవాళ ప‌లు న‌గ‌రాల్లో ఆందోళ‌న‌కారులు హింస‌కు దిగారు. గోర‌ఖ్‌పూర్‌లో నిర‌స‌న‌కారులు పోలీసుల‌పై రాళ్లు రువ్వారు. బులంద్‌షెహ‌ర్ ప‌ట్ట‌ణంలో ఆందోళ‌న‌కారులు వాహ‌నాల‌కు నిప్పుపెట్టారు. ప‌ట్ట‌ణ‌మంతా పోలీసులు భారీ సంఖ్య‌లో మోహ‌రించారు. ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో కూడా అల్ల‌ర్లు జ‌రిగాయి. అక్క‌డ 144వ సెక్ష‌న్ విధించినా.. ఆందోళ‌న‌కారులు భారీ సంఖ్య‌లో రోడ్ల‌పైకి వ‌చ్చారు. ల‌క్నోతో పాటు ప‌లు న‌గ‌రాల్లో పోలీసులు డ్రోన్ల‌తో భ‌ద్ర‌త‌ను స‌మీక్షించారు. ల‌క్నోలో ప్ర‌స్తుతం ప‌రిస్థితి అదుపులో ఉన్న‌ట్లు పోలీసులు చెప్పారు. ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను ర‌ద్దు చేశారు. గురువారం జ‌రిగిన హింసాఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు కేసు న‌మోదు చేశారు.

* గుంటూరులో 4సంవత్సరాల వయసున్న నేపాలి బాలికపై హత్యాచారనికి పాల్పడ్డ నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ మహిళ సంఘాలు ర్యాలీ నిర్వహించారు

* వెలగపూడి రైతుల రిలే నిరాహారదీక్షలో వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్‌ కుమారుడని జగన్‌కు ఓట్లేసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మించి మోసం చేయడం సీఎం జగన్‌కు తగదని అన్నారు. మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని సూచించారు. తమ భూముల్లో కట్టిన భవనాల్లో ఎందుకు ప్రమాణ స్వీకారం చేశారని ప్రశ్నించారు. రాజధాని మారదని హామీ ఇచ్చిన ఆర్‌కే ఇప్పుడు ఎక్కడున్నారని అడిగారు. ప్రభుత్వ ప్రకటనతో తామూ దిక్కుతోచని స్థితిలో పడ్డామని వైకాపా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.

* జైపుర్​ బాంబు పేలుళ్ల కేసు దోషులకు మరణశిక్ష 2008లో రాజస్థాన్​ రాజధాని జైపుర్​లో జరిగిన వరుస పేలుళ్ల కేసులో నలుగురు దోషులకు శిక్ష ఖరారు చేసింది ప్రత్యేక న్యాయస్థానం. వారందరికీ ఉరిశిక్ష విధించాలని తీర్పునిచ్చింది.  సుదీర్ఘ విచారణ… జైపుర్​లో 2008 మే 13న 8 ప్రాంతాల్లో వరుస పేలుళ్లు జరిగాయి. ఈ దుర్ఘటనలో 70 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 185 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో మహ్మద్​ సైఫ్​, మహ్మద్​ సర్వార్​ అజ్మి, మహ్మద్​ సల్మాన్​, సైఫర్ ​రెహ్మాన్​ను భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్​ 120బి కింద బుధవారం దోషులుగా ప్రకటించింది జైపుర్​లోని ప్రత్యేక న్యాయస్థానం. మరో నిందితుడు షాహ్​బాజ్​ హుస్సేన్​పై వచ్చిన ఆరోపణలు నిరూపితంకానందున అతడ్ని నిర్దోషిగా తేల్చింది. నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించాలని నేడు తీర్పు ఇచ్చింది.

* గుంటూరులో అత్యాచారానికి గురై జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న నాలుగు సంవత్సరాల ఇద్దరు చిన్నారులను పరామర్శించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే జిల్లాలో అత్యాచారాలు పెరిగిపోయాయని ఆయన మండిపడ్డారు.

* విజయవాడ పాకిస్దాన్ కు సమాచారం చేరవేస్తున్న ఏడుగురు నేవి సిబ్బందిని అదపులోకి తీసుకున్న ఇంటిలిజెన్స్ అధికారులు విజయవాడ కోర్టుకు తరలింపు. వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతున్న ఇంటిలిజెన్స్ అధికారులు.

* ఉంగుటూరు మండలం ఉషారామ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న గౌతమి నిన్న విజయవాడలో ని ఒక లాడ్జె లో లోకేశ్ అనే స్టూడెంట్ ఇరువురు ఆత్మహత్య ప్రయత్నం గౌతమీ మృతి…లోకేష్ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు…. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…గౌతమి తెంపల్లి గ్రామానికి చెందిన గా గుర్తింపు.