Health

యోగాతో అపరిమితమైన లాభాలు

Why should you do yoga? Rethink again-Dec 2019 health news in telugu

యోగా చేయడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. శారీరకంగా, మానసికంగా ధృఢంగా మారతాం. యోగా అనేది ఓ దివ్యౌషధం అని గుర్తుంచుకోవాలి. దీన్ని రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయడం వల్ల అనేక లాభాలుంటాయి.

శ్వాసక్రియలో ఇబ్బందులు లేకుండా సులభంగా ఉంటుంది. యోగాభ్యాసం ద్వారా శరీరంలో ఆక్సిజన్‌తో కూడిన రక్తం శరీరమంతా బాగా స్సరిస్తుంది.

వీటితో పాటు కొన్ని రకాల హార్మోన్స్ విడుదల అవుతాయి. ఈ కారణంగా శరీరం రిలాక్స్ అవుతుంది. చక్కని విశ్రాంతి పొందుతారు.

యవ్వనంగా కనిపిస్తారు.. వృద్ధాప్య ఛాయలు దూరమవుతాయి.

శరీరం రిలాక్స్ అవ్వడం వల్ల నిద్రలేమి సమస్యలు దూరం అవుతాయి. హాయిగా నిద్రపోతారు.

కంటి సమస్యలు, మిగతా ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.

కొవ్వు నిల్వలు సమతుల్యంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకున్నవారికి యోగా అధ్భుత ఔషధమని చెప్పొచ్చు.

శరీరం అనుకున్న విధంగా ఫ్లెక్సీబుల్‌గా ఉంటుంది.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సైనస్, ఎలర్జీ సమస్యలు దూరం అవుతాయి.

తలనొప్పి, మైగ్రేన్ అంటే పార్శపు నొప్పి తగ్గి పోతుంది.

జీర్ణ సమస్యలు కూడా దరిచేరవు.

కంప్యూటర్ వర్క్ చేసేవారు మెడనొప్పు, వెన్ను నొప్పి, తలనొప్పులతో బాధపడతారు. అలాంటి వారు కొన్ని ఆసనాలు వేయడం వల్ల అలాంటి సమస్యలు అన్నింటినీ దూరం చేసుకోవచ్చు.

మోకాళ్ల నొప్పులు, శరీరాన్ని ఇబ్బంది పెట్టే మరికొన్ని కూడా దూరం అవుతాయి.

వీటితో పాటు మనసు ఆనందంగా, ప్రశాంతంగా ఉంటుంది.

ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపక శక్తి, గ్రహణశక్తి పెరుగుతుంది.

ఆత్మవిశ్వాసం , స్వీయ క్రమశిక్షణ అలవడతాయి. భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి.

అనవసరమైన ఆలోచనలో మనసులోకి రావు..

ఏవైనా సమస్యలు వచ్చినప్పు ఎలా పరిష్కరించాలనే సామర్థ్యం, ధైర్యం పెరుగుతాయి.