4దేశాల్లో ఆహార రంగంలో వినూత్న సాంకేతికతతో పాటు నాణ్యమైన వంటకాలను అందిస్తూ అద్భుతంగా పురోగమిస్తున్న “Biriyanis & More” రెస్టారెంట్లకు, దాని అధినేత సూర్యదేవర రామానాయుడు(సూర్య)కు మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. భారతదేశంలో వ్యాపార రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ప్రతి ఏటా వాణిజ్య పురస్కారాలను అందించే India 5000 సంస్థ ఈ ఏడాది ఢిల్లీలోని ఇస్కాన్‌లో జరిగిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో సూర్యాకు, “Biryanis & More”కు వినియోగదారుల సంతృప్తి(Customer Satisfaction) మరియు Best Startup విభాగాల్లో పురస్కారాన్ని అందజేసింది. ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే ఇండియాతో పాటు దుబాయి, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో 60కు పైగా విభాగాలతో 2000మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ సంస్థకు పురస్కారం రావడం ఆనందంగా ఉందని సూర్య తెలిపారు.
Biryanis & More సూర్యాకు మరో ప్రతిష్టాత్మక అవార్డు
Related tags :