మహారాష్ట్ర రైతులకు ఊరట కల్పిస్తూ రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. రైతుల రుణాలు రూ. 2లక్షల వరకు మాఫీ చేస్తామని శనివారం అసెంబ్లీలో ప్రకటించారు. ‘2019 సెప్టెంబరు 30 వరకు ఉన్న పంట రుణాలపై ఒక్కో రైతుకు గరిష్ఠంగా రూ. 2లక్షల వరకు మాఫీ చేస్తాం. మహాత్మా జ్యోతిరావ్ ఫూలే పేరుతో ఈ రుణమాఫీ పథకం తీసుకొస్తున్నాం. మార్చి నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది’ అని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు షరతులు విధించడం సరికాదని ఆరోపించించాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్ సహా భాజపా సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
మహారాష్ట్ర రైతులకు ₹2లక్షల రుణమాఫీ
Related tags :