హరిహరసుతుడు అయ్యప్ప స్వామి కొలువైన శబరిమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. స్వామివారి దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం స్వామి వారి దర్శనార్థం ఆన్లైన్లో ముందస్తుగా రిజర్వ్ చేసుకున్నవారికి 4 గంటలకుపైగా సమయం పడుతోంది. రిజర్వ్ చేసుకోనివారికి 6 నుంచి 8 గంటల సమయం పడుతోంది. మరోవైపు పంపానదిలో మోకాళ్లకన్నా తక్కువలోతుకు నీరు చేరింది. దీంతో భక్తులు స్నానాలు ఆచరించేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
అయ్యప్పకు పోటెత్తిన భక్తులు
Related tags :