ఆకలితో అలమటిస్తున్న 60 ఏళ్ల యాచకురాలికి అన్నం పెడతామని ఇంట్లోకి పిలిచి.. ఆమెపై ఇద్దరు కామాంధులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి మల్కాజిగిరి సీఐ మన్మోహన్ కథనం మేరకు వివరాలిలు.. లాలాపేటకు చెందిన చిన్నప్ప అంథోని జార్జ్(50), వికారాబాద్ జిల్లా స్టేషన్ ధరూర్‌కి చెందిన నేనావత్ విజయ్ కుమార్‌లను భార్యలు వదిలేశారు. వీరిద్దరూ పెయింటింగ్ పనులు చేసుకుంటూ మీర్జాలగూడలో కలిసి నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ఓ యాచకురాలు వీరి ఇంటి ముందుకు వచ్చింది. అన్నం పెడతానని జార్జ్ ఆమెను లోపలకు పిలిచాడు. ఇద్దరూ వృద్ధురాలిని కబుర్లలోకిదించారు. బలవంతంగా మద్యం తాగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే 100 నంబరుకు ఫోన్‌చేసి పరిస్థితిని వివరించారు. నిందితులు అక్కడినుంచి పారిపోయారు. శుక్రవారం నిందితులు మీర్జాలగూడలో సంచరిస్తుండగా వారిని అరెస్టు చేశారు.
మల్కాజ్‌గిరిలో 60ఏళ్ల బిచ్చగత్తెపై ఇద్దరి అత్యాచారం
Related tags :