ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటర్..మార్కెట్లోకి ఒకేసారి మూడు స్కూటర్లను ప్రవేశపెట్టింది. దేశీయంగా ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన ఫాస్కినో 120ఎఫ్‌ఐ, రేజెడ్‌ఆర్ 125ఎఫ్‌ఐ, స్ట్రీట్ ర్యాలీ 125ఎఫ్‌ఐ మోడళ్లు ఉన్నాయి. తొలిసారిగా సంస్థ 125 సీసీ సెగ్మెంట్‌లోకి ప్రవేశించంది. వీటితోపాటు బీఎస్-6 ప్రమాణాలు కలిగిన ఎంటీ15, ఆర్ 15 మోటర్‌సైకిళ్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ..వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా 6.50 లక్షల యూనిట్ల వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 5 శాతంగా ఉన్న మార్కెట్ వాటాను 2025 నాటికి 10 శాతానికి పెంచడానికి పలు నూతన వాహనాలను విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. 2019లో 2.94 లక్షల యూనిట్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసిన సంస్థ..వచ్చే ఏడాది 3.10 లక్షల యూనిట్లను ఎగుమతి చేయాలనుకుంటున్నది. 125 సీసీ సామర్థ్యం కలిగిన స్కూటర్‌ను విడుదల చేయడంతో భవిష్యత్తులో పాత మోడళ్లను గుడ్‌బై పలుకనున్నట్లు చెప్పారు. వీటిలో ఫాస్కినో 125 ఎఫ్‌ఐ స్కూటర్ రూ.66,430 నుంచి రూ.67,430 మధ్యలో లభించనుండగా, ఆర్15 వెర్షన్ రూ.1.45 లక్షల నుంచి రూ.1.47 లక్షల మధ్యలో నిర్ణయించింది. రేజెడ్‌ఆర్, స్ట్రీట్ ర్యాలీ మోడళ్ల ధరలను త్వరలో ప్రకటించనున్నది.
యమహా నూతన స్కూటర్ మోడల్
Related tags :