Kids

పిల్లలూ..క్రిస్మస్ చెట్టు గీద్దామా?

Here is how a funny way to draw christmas tree for kids in telugu

క్రిస్మస్ ట్రీని ఎలా ఈజీగా గీయాలో తెలుసుకోండి.. ఇది పిల్లలకు నేర్పంచడం వల్ల వారు చక్కగా నేర్చుకుంటారు. ఇలాంటి యాక్టీవిటీస్ పిల్లలలోని ప్రతిభని కూడా వెలికి తీస్తాయి. ఈ క్రిస్మస్ వేడుకకి మీ పిల్లలతో కలిసి సెలబ్రేట్ చేసుకోండి. ఈ టైమ్‌లో ప్రతీ ఒక్కరూ ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి విష్ చేయాలనుకుంటారు. ఇందుకోసం ఏవేవో గిఫ్ట్ ఆర్టికల్స్ కొంటుంటారు. పిల్లలు కూడా.. అయితే వారికి మీరే క్రిస్మస్ ట్రీని ఎలా ఈజీగా గీయాలో నేర్పించండి. క్రిస్మస్ రానే వస్తోంది. ఈ వేడుకను చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో పిల్లలు అందరికీ విష్ చేస్తుంటారు. ఇంట్లో పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని ఆరాటపడతారు. వారు చేసే హంగామాతో ఫెస్టివల్ మూడ్ రానే వస్తుంది. దీనికి తోడు.. వారితో కొన్ని యాక్టివిటీస్ చేయిస్తే.. ఆ హ్యాపీనెస్ రెట్టింపు అవుతుంది. అందుకే.. వారితో డ్రాయింగ్ వేయించండి.

క్రిస్మస్ ట్రీని ఎలా గీయాలంటే..

స్టెప్ 1

ముందుగా ఓ పేపర్‌ని తీసుకోండి. అందులో ‘V’ అనే అక్షరాన్ని తిప్పి గీయండి..

స్టెప్ 2

ఇప్పుడు ఆ చివర ఈ వరని కలుపుతూ వలయాకారాన్ని గీయండి.

స్టెప్ 3

ఇప్పుడు అదే మాదిరిగా కింద మరో ఆకారాన్ని రెండు సార్లు గీయండి.

స్టెప్ 4

చివరగా ఆఖరికి ఉన్న ఆకారానికి కింద సరిగ్గా మధ్యలో రెండు గీతలని గీసి చివర్లు కలపండి.. ఇది చూడ్డానికి కాండంలా కనపడుతుంది. ఇప్పుడు ట్రీ ఆకారం వచ్చింది.

స్టెప్ 5..

ఇప్పుడు చెట్టు పై భాగంలో నక్షత్రాన్ని గీయండి. ఇలా తయారైన క్రిస్మస్ ట్రీకి రంగులు వేయండి.. ఇది మరింత అందంగా కనిపించాలంటే గీసిన బొమ్మని షైనర్ వంటి పెన్నులతో అవుట్‌ లైన్ గీయొచ్చు. ఆ తర్వాత వాటికి రకరకాల రంగులు అద్దొచ్చు. మార్కెట్లో కొన్ని షైనీ స్టిక్కర్స్ దొరకుతాయి. వీటిని అతికించడం వల్ల గీసిన చిత్రం మరింత అందంగా కనిపిస్తుంది. ఇది మీ పిల్లలకు మీరు నేర్పించొచ్చు.

ఇలా కొన్ని ఈజీ స్టెప్స్‌తో పిల్లలకి మనం ఏదైనా నేర్పించినప్పుడు అవి వారు చక్కగా నేర్చుకుంటారు. ఇలాంటి వేడుకల్లో పెయింటింగ్ వంటివి చేయడం వల్ల వారిలోని ప్రతిభ బయటికి వస్తుంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు. వారిని పెద్దలు ప్రోత్సహించినట్లుగా ఉంటుంది. నిజానికీ కొన్న గిఫ్ట్స్ ఐటెమ్స్ కంటే ఇలా స్వయంగా తయారు చేసినవి మనసుకి ఎంతగానో తృప్తినిస్తాయి. ఇలా పిల్లలకు నేర్పించడం వల్ల వారు కొత్త విషయాలను నేర్చుకోవడమే కాకుండా స్మార్ట్ ఫోన్స్, గ్యాడ్జెట్స్ వంటి వాటికి దూరంగా ఉంటారు. అయితే.. నేర్పించే సమయంలో వారికి మాత్రమే చెప్పకుండా పిల్లలతో పాటు మీరు చేయండి.. అప్పుడే వారు మిమ్మల్ని చూస్తూ ఆ విధంగా ట్రై చేస్తుంటారు. గ్రీటింగ్ కార్డ్స్ అనేవి ఇప్పుడిప్పుడు బాగా పాపులర్ అవుతున్నాయి. కానీ, చిన్నతనంలో ఎక్కువగా నచ్చిన బొమ్మలను ఓ కాగితంపై గీసి నూతన సంవత్సరం, ఇతర పండుగలు వచ్చినప్పుడు సన్నిహితులకు ఇచ్చేవారు. ఇది చాలా మందికి గుర్తుండే ఉంటుంది. దీని వల్ల ఓ సంతృప్తి ఉండేది.. అలాంటి వాటిని మళ్లీ చిన్నారులకు తిరిగి నేర్పించడం వల్ల వారికి చక్కని నైపుణ్యాన్ని ఇచ్చినవారవుతాం.