Business

భారతదేశంలో కోటి మంది మహిళలు మద్యం ప్రియులు

One Crore Indian Women Are Drunkers Says Survey

దేశంలో మద్యం సేవించడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. ఒకప్పుడు కొంతమంది మాత్రమే దీనిని తీసుకున్నారు. ఎప్పుడైతే వెస్ట్రర్న్ కల్చర్ దేశంలోకి ఎంటర్ అయ్యిందో అప్పటి నుంచి ప్రజల లైఫ్ స్టైల్ మారిపోయింది. మద్యం సేవించడం సోషల్ కల్చర్ గా మార్చుకున్నారు. దేశంలో 16 కోట్ల మంది మద్యం సేవించే వ్యక్తులు ఉన్నట్టుగా తాజా సర్వేలో తేలింది. అంటే ఇది దేశజనాభాలో 14.6% అన్నమాట. ఇందులో మహిళలు కోటి మంది వరకు ఉన్నారని సర్వేలు చెప్తున్నాయి. మద్యం తాగే అలవాటు ఉన్నప్పటికి మహిళలు కంట్రోల్ లో ఉంటారని, పరిమితికి మించి తీసుకోరని నివేదికలు చెప్తున్నాయి. కానీ, మగవాళ్ళు అలాకాదని, మద్యం తాగడాన్ని అలవాటుగా మార్చుకుంటే… దానికి బానిసలుగా మారిపోయారని నివేదికలు చెప్తున్నాయి. లిక్కర్ తాగేవాళ్ళలో 4శాతం మంది వైన్ తాగుతారని, 21 శాతం మంది బీర్ కు జైకొడుతున్నారని సర్వేలు తెలియజేస్తున్నాయి.