Politics

నా మీద కోపంతో ప్రజలను హింసిస్తున్నారు

Chandrababu Tours Amaravathi And Speaks To Local Farmers

తుళ్లూరు మహాధర్నా లో రైతులతో మాట్లాడించిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు

ముస్లిం మహిళ: అన్ని కులాలు మతాలు ఒక్కటే అని నమ్మి రెండున్నర ఎకరాలు రాజధానికి ఇచ్చా. ఇవాళ మమ్మల్ని రోడ్డుపై నిలబెట్టి ఎన్నో అవమానాలకు గురిచేస్తున్నారు. మా రాజధాని మాకు కావాల్సిందే.

మహిళా రైతు: పిల్లల భవిష్యత్తు కోసం కలసి కట్టుగా భూములిచ్చాం. 3రాజధానులు వద్దు. ఒక్కటే రాజధాని కావాలి అది అమరావతై ఉండాలి.

మనీషా, వెంకటపాలెం: నేనున్నాను అని ఎన్నికల ముందు జగన్ అన్నారు… ఇప్పుడు మా పిల్లల భవిష్యత్తు ఏమిటి? జై అమరావతి!

##########
టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కామెంట్స్…..

అమరావతి రైతుల్ని ఈ పరిస్థితుల్లో చూస్తాననుకోలేదు

సమాజ హితం కోసం ముందుకొచ్చిన త్యాగధనులు మీరు

రాష్ట్రం నిలదొక్కుకోవాలనే ఉద్దేశం తో మీరు భూముల ఇచ్చేందుకు నాడు ముందుకొచ్చారు

మీకందరికీ ఆమోదయోగ్యమైన ప్యాకేజి నాడు ప్రకటించా

ఇది ఓ మహానగరంగా అభివృద్ధి చెందుతుందని మీరంతా భూములిచ్చారు

రైతులకు న్యాయం కోసమే రైతు దినోత్సవం జరుపుకుంటున్నారు

రైతు దినోత్సవం రోజే రోడ్డు పై ఉండటం బాధ కలిగిస్తోంది

అమరావతి లో రైతులు ప్రథమ పౌరులుగా ఉంటారని ఆశించా

నాడు చంద్రబాబు గా హామీ ఇవ్వలేదు….ప్రభుత్వం నుంచి సీఎం గా హామీ ఇచ్చాను.

ఎకరం భూమి ఇవ్వడానికి ముందుకు రాని పతిస్థితుల్లో….33 వేల ఎకరాలు ఇచ్చారు.

ఒక్క ఇల్లు కట్టాలంటే మూడేళ్లు పడుతుంది.

రైతులకు న్యాయం జరగాల్సిందే

అమరావతి పై జగన్ ఎందుకు మాట తప్పి మడం తిప్పారు

30వేల ఎకరాలు కావాలని నాడు అని ఇప్పుడెందుకు 200ఎకరాలు చాలు అంటున్నారు

ఇన్సైడ్ ట్రేడింగ్ పేరుతో అమరావతి ని చంపేయటం అన్యాయం, దుర్మార్గం

ధైర్యం ఉంటే హైకోర్టు ద్వారా ఇన్సైడ్ ట్రేడింగ్ పై న్యాయ విచారణ జరిపించండి

మేమూ విచారణకు సహకరిస్తాం. తప్పు తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధం

రాజకీయాలు ఎన్నికలప్పుడు చేసుకుందాం

నాకు ఇప్పుడు కావాల్సింది అమరావతే

జీఎన్ రావు ఎవరిని అడిగి నివేదిక రూపొందించారు

జీఎన్ రావ్ రిపోర్ట్ కి ఉన్న విశ్వసనీయత ఎంత

ముఖ్యమంత్రి పేపర్ లీక్ చేస్తే జీఎన్ రావు పరీక్ష రాసినట్లుంది

జీఎన్ నివేదిక జగన్ నివేదిక తప్ప మరొకటి కాదు

విశాఖ అభివృద్ధి కి తెలుగుదేశం వ్యతిరేకం కాదు

విశాఖ ను ఆర్ధిక రాజధాని గా ప్రకటించాం

ఐటీ హబ్ గా విశాఖ అభివృద్ధి కి శ్రీకారo చుట్టాం

పర్యాటక కేంద్రంగా విశాఖ పరిసర ప్రాంతాల అభివృద్ధి కి పూనుకున్నాం

సచివాలయం లేదా అసెంబ్లీ అక్కడ పెడితే అది అభివృద్ధి కాదు

అసెంబ్లీ ఓ దగ్గర, సచివాలయం మరో ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా లేదు

నాపై కోపంతో ప్రజల్ని హింసించడం తగదు