చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు ఆదివారం బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి విదేశీ ఉడుతలు, ఉడుములు, ఎలుకలను స్వాధీనం చేసుకున్నారు. విదేశీ సరీసృపాలు అక్రమంగా తరలిస్తున్నట్లు అందిన రహస్య సమాచారంతో.. ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేయగా.. చిన్నచిన్న ప్లాస్టిక్ బాక్సుల్లో విదేశీ ఎరుపు రంగు ఉడుత, ఆస్ర్టేలియాకు చెందిన కం గారు జాతి ఎలుకలు, నీలిరంగు ఉడుము కనిపించాయి. దీంతో ప్రయాణికుడిని అరెస్టు చేసి జంతువులను బ్యాంకాక్‌కు తిప్పిపంపటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
బ్యాంకాక్ నుండి ఎలుకల స్మగ్లింగ్
Related tags :