డీఆర్‌డీవో ఇవాళ క్విక్ రియాక్షన్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.
క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ వ్యవస్థను డీఆర్‌డీవో అభివృధ్ది పరిచింది.
ఒడిశాలోని చండీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి దీన్ని పరీక్షించారు.
మధ్యాహ్నం 11.45 నిమిషాలకు ఈ పరీక్ష జరిగింది. టార్గెట్‌ను మిడ్ ఎయిర్‌లోనే షూట్ చేశారు.
మిషన్ లక్ష్యాలను అందుకునే విధంగా పరీక్షను చేపట్టారు. ఏరియల్ టార్గెట్‌ను మిస్సైల్ తన పూర్తి సామర్థ్యంతో ఢీకొన్నట్లు అధికారులు చెప్పారు.
డైరక్టర్ జనరల్ ఎంఎస్‌ఆర్ ప్రసాద్ ఈ పరీక్షను ఇవాళ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
ఈ పరీక్షతో డెవలప్మెంటల్ ట్రయల్స్ పూర్తి అయినట్లు డీఆర్‌డీవో వెల్లడించింది.
2021లో ఈ వెపన్ సిస్టమ్‌ను సైనిక దళాల్లోకి ఇండెక్ట్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.