* మందడం రహదారి పై ట్రాక్టర్లు అడ్డంగా పెట్టిన రైతులు. రహదారిపైనే పశువుల్ని కట్టేసి రైతుల నిరసన. రైతు దినోత్సవం రోజే తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం. రోజు రైతు దినోత్సవం సందర్భంగా… వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్న నెక్కల్లు రైతు. మిరప..పత్తి మొక్కలు ధరించి నిరసన తెలుపుతున్న రైతు నరసింహారావు. రోజుకో గెటప్ తో నిరసన తెలుపుతున్న నరసింహారావు. రైతుల అర్ధ నగ్న ప్రదర్శన. మందడం లో రైతులు అర్ధ నగ్న ప్రదర్శన. చొక్కాలు తీసేసి రహదారిపై బైఠాయించి రైతులు నిరసన. 29 గ్రామాల్లోనూ పోలీస్ పికెటింగ్. వచ్చిపోయేవారిని ఆపి గుర్తింపు కార్డులు అడుగుతున్న పోలీసులు. ఆధార్ కార్డులో అడ్రస్‌లు పరిశీలిస్తున్న పోలీసులు. పికెటింగ్ పై రైతుల ఆగ్రహం.
* సుమారు రూ. 24 లక్షల విలువ చేసే 620 గ్రాముల బంగారు, 180 గ్రాముల వెండి ఆభరణాలు, మరియు రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పలు నేరాలకు పాల్పడిన ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండీ సుమారు రూ. 24 లక్షల విలువ చేసే 620 గ్రాముల బంగారు, 180 గ్రాముల వెండి ఆభరణాలు మరియు రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఒకరు మినహా మిగితా వారందరూ పాత నేరస్తులే. ఇళ్లల్లో దొంగతనాలు చేయడంలో వీరంతా సిద్ధహస్తులు. సోమవారం జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు గారు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నిందితుల వివరాలు : 1) షికారి కోటయ్య @ షాలి, వయస్సు 25 సం., అనంతసాగరం కాలనీ, అనంతపురము. 2) షికారి రామకృష్ణ @ బుజ్జి, వయస్సు 28 సం., అనంతసాగర్ కాలనీ, అనంతపురము, 3) షికారి మెచిలి @ నాగి, వయస్సు 22 సం.లు, బుడ్డప్ప నగర్, అనంతపురము, 4) షికారి శీన@ సద్ సింగ్,వయస్సు 40 సం., టి.వి.టవర్ ఏరియా, ఆనంతపురము, 5 ) షికారి శీను @ పంది, వయస్సు 20సంలు, టి.వి టవర్, అనంతపురము
* దేశ రాజధాని ఢిల్లీలోని కైరారీ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. మూడంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు. మిగతా మూడంతస్తుల్లో ఇండ్లు ఉన్నాయి. అయితే రెండో అంతస్తులోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి గోడ కూలిపోయింది. ఆ మంటలు గ్రౌండ్ ఫ్లోర్ లోని క్లాత్ గోడౌన్ కు వ్యాపించాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 10 మంది గాయపడగా.. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది.
* సంచలనం రేపిన జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్య కేసులో ఇవాళ సౌదీ అరేబియా కోర్టు అయిదుగురికి మరణశిక్షను విధించింది. సౌదీ ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టుగా ఖషోగ్గి ఫేమస్. అయితే టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ కాన్సులేట్‌లో జర్నలిస్టు ఖషోగ్గిని హత్య చేశారు. ఆ హత్యలో సౌదీ పాత్ర ఉన్నట్లు అమెరికా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అదో తప్పుడు ఆపరేషన్ అని సౌదీ అరేబియా ప్రాసిక్యూటర్ ఇవాళ తెలిపారు. ఈ కేసులో మొత్తం 11 మందిని అరెస్టు చేసి విచారించారు. వారి వివరాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. ఖషోగ్గి హత్యపై ఐక్యరాజ్యసమితి నిపుణులు కూడా గతంలో స్పందించారు. ఆ హత్య కోర్టు బయట జరిగిన నేరంగా పరిగణించింది. 2018, అక్టోబర్ 2న ఖషోగ్గి హత్య జరిగింది. ఈ కేసులో మాజీ డిప్యూటీ ఇంటెలిజెన్స్ చీఫ్ అహ్మద్ అల్ అసిరిని నిర్దోషిగా రిలీజ్ చేశారు.
* తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి నరేందర్ రెడ్డి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. వివరాల్లోకెళ్తే.. శ్రావణ్ కుమార్ అనే రైతు తన భూమి ఆన్‌లైన్‌లో రిజిష్టర్ కాలేదు. దీంతో ఆయన తన భూమిని ఆన్‌లైన్‌లో రిజిష్టర్ చేయించడం కోసం చాలా రోజులుగా తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్నాడు. తన విన్నపాన్ని ఏ అధికారి కూడా వినకపోగా.. లంచం డిమాండ్ చేశారు. ఆఖరికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి అయిన నరేందర్ రెడ్డిని రైతు శ్రావణ్ సంప్రదించాడు. రూ. 40 వేలు ఇస్తే పనవుతుందని రైతుకు తెలిపాడు. దీనికి సరేనన్న రైతు.. ముందుగా సమాచారాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేశాడు. రైతు నుంచి ఉద్యోగి శ్రావణ్ రెడ్డి డబ్బులు తీసుకుంటున్న క్రమంలో ఏసీబీ అధికారులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారులు నరేందర్ రెడ్డి కార్యాలయంతో పాటు అతని నివాసాలపై సోదాలు చేస్తున్నారు.
* రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన మీసేవా సర్వీసులు. విధుల్లోకి రాని మీసేవా నిర్వాహకులు. తహసీల్దార్, జిల్లా కలెక్టర్ కార్యాలయలల్లో మీసేవా నిర్వాహకులు ఫిర్యాదులు.
* హైదరాబాద్ లోని అంబర్ పేట పటేల్ నగర్ లో కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై 2007 బ్యాచ్ కు చెందిన ఎస్ఐ సైదులు ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అంబర్ పేట్ పోలీసులు.
* అమరావతి పరిరక్షణ సమితి ఆద్వర్యంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి ఎదుట ధర్నా వర్తక,వ్యాపార, బిల్డర్స్, లాయర్స్, కార్మిక సంఘాలతో రాజధాని పరిరక్షణ సమితి ఏర్పాటు చేసుకున్నాం అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని ప్రకటించేవరుకు మా ఆందోళన ఆగదు రియల్ ఎస్టేట్ హైప్ కోసమే విశాఖకు రాజధాని ప్రకటించారు అభివృద్ది వికేంద్రీకరణ కాదు.. అధికార వికేంద్రీకరణ చేస్తున్నారు నిర్ణయం మార్చుకోకపోతే మా ఆంధోళన తీవ్రతరం చేస్తాం – అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు.