చదునుగా ఉండే ఫ్లాట్స్ అన్ని సందర్భాల్లోనూ పనికిరావు అనుకుంటాం. కానీ కాస్త కొత్తదనం, స్టయిల్ జోడిస్తే, ఎలాంటి సందర్భాలలోనైనా ఈ రకం చెప్పులు ధరించవచ్చు.
మెరుపులు: హీల్స్‌తో సమానమైన ఆకర్షణను ఫ్లాట్స్‌కు తెప్పించాలంటే, వాటికి మెరుపులు జోడించాలి. సాదా సీదా ప్లెయిన్ లెదర్ ఫ్లాట్స్‌కు బదులు, సెక్విన్ వర్క్ కలిగిన ఫ్లాట్స్ ఎంచుకుంటే కొత్తగా కనిపిస్తారు.
బోల్డ్ కలర్స్: ఎప్పుడూ హీల్స్ వేసుకుంటే మడమ నొప్పులు తప్పవు. కాబట్టి అప్పుడప్పుడూ ఫ్లాట్స్ వేసుకుంటూ ఉండాలి. అయితే అవి ఎరుపు, నీలం లాంటి ముదురు రంగుల్లో ఉండేలా చూసుకోవాలి.
మ్యూల్స్: మొనదేలి ఉండే పాయింటెడ్ టోస్ రకం మ్యూల్స్ ఓవర్ కోట్, జీన్స్ మీదకు నప్పుతాయి. నలుపు, ఎరుపు రంగుల్లో ఎంచుకుంటే అన్ని రకాల దుస్తులకూ మ్యాచ్ అయిపోతాయి.
మెటాలిక్: మరీ పొడవుగా ఉండే అమ్మాయిలు సిల్వర్, గోల్డ్ రంగుల్లో ఫ్లాట్ షూస్ ఎంచుకోవచ్చు. పొడవాటి గౌన్లు వేసుకున్నప్పుడు, దాని అడుగున దోబోచులాడుతున్నట్టుగా ఉండే, ఫ్లాట్స్ అప్పుడప్పుడూ మెరుపులు చిందిస్తూ, కళ్లను కట్టిపడేస్తాయి.