కాలిఫోర్నియాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ ట్రైవాలీ(TATVA) అధ్వర్యంలో ‘జల్సా-2019’ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్వహించింది. స్త్రీలు, పురుషులు, పిల్లలు అంతా డాన్స్, స్కిట్స్, పాటల పోటీల్లో పాల్గొని కార్యక్రమాన్ని ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా సిమీ వ్యాలీ పోలీస్ డిపార్ట్‌మెంట్ కమాండర్ షార్ట్స్ హాజరయ్యారు. తాము సేకరించిన విరాళాలను పోలీస్ డిపార్ట్‌మెంట్ సంక్షేమానికై కమాండర్‌కు ఆర్గనైజేషన్ సభ్యులు అందజేశారు. అంతే కాకుండా ఆయన్ను ఘనంగా సన్మానించారు. సిమీ వ్యాలీ పోలీస్ డిపార్ట్‌మెంట్ వారికి ఇంతగా సహాయ సహకారాలు అందిస్తున్న తెలుగువారికి ధన్యవాదాలు చెబుతున్నానని ఈ సందర్భంగా కమాండర్ షార్ట్స్ తెలియజేశారు.