చిలక్కొట్టిన జాంపండు…’ అంటూ చిలక్కొట్టిన పండ్లనే కోసుకుని తినడం తెలిసిందే. కానీ చిలుకలు కొరికితే పండ్లు తియ్యగా ఉండవు. తియ్యగా ఉన్న పండ్లనే చిలుకలు కొడతాయి. అదెలా అంటే- పండ్ల చెట్లన్నీ ఆక్సిన్లూ, జిబ్బరిలిన్లూ, సైటోకైనిన్లూ, ఇథిలీన్, అబ్‌సిసిక్ ఆమ్లం… అనే ఐదు రకాల పదార్థాలను విడుదల చేస్తుంటాయి. వాటిల్లో ఒక రకమైన వాసన కలిగి ఉండే ఇథిలీన్ పండ్లను త్వరగా పక్వానికి వచ్చేలా చేస్తుంది. పండ్లచెట్లమీదే ఉండే చిలుకలు ఈ వాసన కనిపెట్టి పక్వానికి రాబోతున్న ఆ పండును తింటాయి. దాని పొట్టకి కొంచెమే చాలు కాబట్టి మిగిలినది వదిలేస్తుంది. అందుకే ఆ పండు తియ్యగా ఉంటుందన్నమాట.
చిలక్కొట్టుడు వెనుక రహస్యం ఇది
Related tags :