తులసి ఒక ఔషధ మొక్క. ఇంటి పెరట్లో ఉంటే- చాలా అవసరాలకు ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ తులసి ఆకులను గ్రీన్ టీలో గానీ, మామూలు టీ లో అయినా వేసుకుని, తాగితే మంచిది. అనేక వ్యాధులను నయం చేస్తూ, సంపూర్ణ ఆరోగ్యాన్ని నిలబెట్టే అద్భుతమైన ఔషధ గుణాలు తులసిలో ఉన్నాయి. అయితే, తులసి కోసం ఎక్కడో వెతికే పని లేకుండా, ఇంట్లోనే పెంచడం ద్వారా ప్రతిరోజూ తులసి ఆకులను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.తులసి ఆకు రసాన్ని చెంచా తేనెతో కలిపి సేవిస్తే కఫంతో వచ్చే దగ్గు తగ్గిపోతుంది.తులసి వేరునూ, శొంఠినీ సమంగా తీసుకుని ఈ రెంటినీ మెత్తగా నూరి, కుంకుడు గింజ పరిమాణంలో మాత్రను తయారు చేసుకోవాలి. ఆ మాత్రల్ని ప్రతిరోజూ ఒకటి చొప్పున ఉదయాన్నే గోరువెచ్చని నీటితో సేవిస్తే, చాలా రకాల చర్మవ్యాధులు తగ్గిపోతాయి.చెంచా తులసి గింజలను కప్పు నీటిలో వేసి, కాసేపు ఉంచి తాగితే, మూత్రం సాఫీగా రావడంతో పాటు, కాళ్ల వాపులు తగ్గుతాయి.ప్రతిరోజూ నాలుగైదు తులసి ఆకులు నమిలి మింగితే ఆరోగ్యానికి మంచిది.
శీతాకాలం కఫానికి తులసీ ఆకులతో విరుగుడు
Related tags :