ఎన్‌ఆర్‌సీ (జాతీయ పౌరపట్టిక)పై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మైనార్టీలకు వైకాపా ప్రభుత్వం అండగా ఉంటుందని.. ఎన్‌ఆర్‌సీకి ఏపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ దానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతివ్వదన్నారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా రిమ్స్‌లో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రిమ్స్‌లో సూపర్ స్పెషాలిటీ విభాగం, క్యాన్సర్ నివారణ కేంద్రం, మానసిక వైద్యశాల, ఎల్.వి.ప్రసాద్ కంటి ఆస్పత్రి విభాగాలకు శంకుస్థాపన చేసిన అనంతరం జగన్ మాట్లాడారు. ఇప్పటికే ఉపముఖ్యమంత్రి అంజద్‌బాషా ఎన్‌ఆర్‌సీపై ప్రకటన చేశారని.. తనతో చర్చించాకే దీనిపై ఆయన మాట్లాడారన్నారు. ఉపముఖ్యమంత్రి ఇచ్చిన ప్రకటనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ విషయంలో ప్రతి ముస్లిం సోదరుడికి అండగా ఉంటామని జగన్ స్పష్టం చేశారు.
NRCకు ఏపీ మద్దతు ఇవ్వదు
Related tags :