* పాతబస్తీకి చెందిన ఆస్మా బేగం శరీరంలో బుల్లెట్ దిగిన ఘటనలో పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బుల్లెట్ శరీరంలోకి ఎలా దూసుకెళ్లిందన్న దానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఆస్మాబేగం, ఆమె కుటుంబ సభ్యులు దర్యాప్తుకు సహకరించడం లేదని పోలీసులు తెలిపారు. దేశవాలీ తుపాకితో కాల్చడం వల్లే బుల్లెట్ శరీరంలోకి దిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆస్మాబేగం తండ్రి గతంలో కింగ్స్ పంక్షన్ హాల్లో కాపలాదారుగా పనిచేశారు. అక్కడ జరిగిన వేడుకల్లో భాగంగా ఏవరైనా తుపాకిని గాల్లోకి పేలిస్తే పొరపాటున ఆస్మాబేగం వెన్నులోకి దిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తుపాకీతో కాల్చిన వ్యక్తితో కుదిరిన అంగీకారం మేరకే అస్మాబేగం, ఆమె కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని బయటపడకుండా చూస్తున్నారమోనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తు్న్నారు. గత కొంత కాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న ఆస్మాబేగం పాతబస్తీలోని ఓ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నారు. నొప్పి ఎక్కువ కావడంతో ఈ నెల 12వ తేదీన ఆస్మాబేగం నిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అయినా నొప్పి తగ్గకపోవడంతో ఈనెల 21వ తేదీన వైద్యులు ఎక్స్ రే తీశారు. దీంతో బుల్లెట్ ఉన్న విషయం బయటపడింది. చిన్నపాటి శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు బుల్లెట్‌ను శరీరం నుంచి తొలగించారు.
* సీబీఐకి యరపతినేని కేసులు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని. శ్రీనివాస్ పై ఉన్న 18 మైనింగ్ కేసులని సీబీఐ కి బదిలీ చేస్తూ….ఏపీ ప్రభుత్వం జీవో జారీ.
* ఏపీ ప్రభుత్వం తీరుపై క్యాట్ సీరియస్ అయ్యింది. పది రోజుల కిందట ఏపీఈడీబీ సీఈఓ కృష్ణ కిషోర్‌ను జగన్ సర్కార్ సస్పెండ్ చేసింది. ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని సీఐడీ కేసు నమోదు చేసింది. దీంతో కృష్ణ కిశోర్ క్యాట్‌ను ఆశ్రయించారు. వారం కిందటే స్టే ఇచ్చిన క్యాట్.. ఇవాళ విచారణ చేపట్టింది. ఐఎర్.ఎస్ అధికారి కృష్ణ కిషోర్‌ను ఎందుకు ఇప్పటి వరకు రిలీవ్ చేయలేదని జగన్ సర్కార్‌ను క్యాట్ ప్రశ్నించింది. కేంద్రం ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోరాటా.. వెంటనే దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని క్యాట్ ఆదేశించింది.
* ప్రైవేటు బస్సు, జీపు ఢీకొనడంతో నలుగురు మృతి చెందిన సంఘటన ఒడిశాలోని అంగుల్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాయపూర్ నుంచి పూరీ వెళ్తున్న జీపును అంగుల్ జిల్లాలో జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఘటనా స్థలంలో నలుగురు దుర్మరణం చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించినట్టు సమాచారం.
* పెళ్లైన పదిరోజుల తరువాత ప్రియుడితో కలిసి నవ వధువు పారిపోవడంతో. పియుడి తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఇరుదాం కాట్టుకు చెందిన వేల్ మురగన్(29) అనే వ్యక్తి కలెక్టరేట్ ఆఫీస్‌లో పని చేస్తున్నాడు. రాజేశ్వరి అనే అమ్మాయిని మురగన్ పది రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. పది రోజుల అత్తాగారింట్లో అందరితో కలిసిమెలిసి అకస్మాత్తుగా తాళిని అత్తాగారింట్లో పెట్టి… 70 తులాల బంగారం, పదివేల రూపాయలతో నవవధువు పారిపోయింది. వరుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. రాజేశ్వరి ఇంటి పక్కన ఉండే నిరుద్యోగి సంతోష్ కనిపించకపోవడంతో అతడిపై పోలీసులు నిఘా పెట్టారు. సంతోష్ స్నేహితుడు గోపిని అదుపులోకి తీసుకొని విచారించారు. సంతోష్, రాజేశ్వరి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, సంతోష్ ఉద్యోగం లేకపోవడంతో అతడికిచ్చి పెళ్లిచేసేందుకు రాజేశ్వరి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో మురగన్ తో పెళ్లి చేశారని పేర్కొన్నారు. భగ్న ప్రేమికులు బెంగళూరు పారిపోయారని గోపి పోలీసులకు తెలిపాడు. పెళ్లైన యువతితో తను కుమారుడు పారిపోవడంతో సంతోష్ తండ్రి జగదీశన్ ఆత్మహత్య చేసుకున్నాడు. సంతోష్ తన కూతురిని కిడ్నాప్ చేశాడని యువతి తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో అతడిపై ఫిర్యాదు చేశాడు. ప్రియుడు, ప్రియురాలు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
* పెద్దపల్లి జిల్లా బొమ్మారెడ్డి పల్లికి చెందిన యువకుడు కట్టా సంతోశ్. అదే జిల్లా ధర్మారానికి చెందిన అభిషేక్‌ను నాలుగేళ్ల క్రితం కలిశాడు. అభిషేక్‌కు చిన్నప్పటి నుంచి హోర్మోన్ సమతుల్యం సరిగ్గా లేనందున ఆడపిల్ల లక్షణాలుండేవి. వీరి మధ్య స్నేహం అతి కొద్ది వ్యవధిలోనే ప్రేమగా మారిపోయింది. ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి. అభిషేక్‌లో హోర్మోన్ అసమతుల్యం గురించి సంతోశ్ అందరికీ చెప్పేయడంతో అందరూ అతణ్ని తేడాగా చూడడం మొదలుపెట్టారు. దీంతో సంతోశ్‌కు దూరం అవ్వాలని అభిషేక్ నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో నిందలు ఎదుర్కొన్నందుకు అభిషేక్‌ను క్షమాపణలు కోరి, కొత్త జీవితం అందిస్తానని సంతోశ్ నమ్మించాడు. ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిగా మారితే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీని ప్రకారం అభిషేక్ ట్రాన్స్ జెండర్‌గా మారి అర్చన అయ్యాడు. గత అక్టోబరులో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. తర్వాత
తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదంటూ అర్చనను కొంతకాలానికి వదిలేశాడు. అయితే, సంతోశ్ ఎందుకు ఇలా ప్రవర్తించాడో తనకు తెలీదని బాధితురాలు అర్చన ఆవేదన వ్యక్తం చేస్తోంది. వదిలేసి వెళ్లిపోవడమే కాక, సంతోశ్ తనపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నాడని అర్చన ఆరోపిస్తోంది. సంతోశ్ తనను చేరదీయాలని డిమాండ్ చేస్తూ ప్రస్తుతం అర్చన పోరాటం చేస్తోంది. ఈమెకు ట్రాన్స్ జెండర్లు కూడా సహకారం అందిస్తున్నారు. అభిషేక్ జీవితంలోకి వచ్చిన సంతోశ్ అతణ్ని మోసం చేసి, అర్చనలా మార్చడమే కాక చివరికి మొహం చాటేశాడని ట్రాన్స్ జెండర్లు మండిపడుతున్నారు.
* బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బల్సనారో బాత్రూమ్ లో జారిపడటంతో గాయాలయ్యాయి. బ్రెసిలియాలో ఉన్న తన అధికార నివాసంలో ఈ ఘటన జరిగింది. బాత్రూమ్లో జారిపడడం వల్ల బల్సనారో తలకు గాయమైంది. వెంటనే ఆయన్ను ఆర్మీ హాస్పటల్‌కు తీసుకువెళ్లి సీటీ స్కాన్ చేశారు. ఈ ఏడాది జనవరిలో బల్సనారో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. గత ఏడాది ఎన్నికల ప్రచార సమయంలో బల్సనారోను గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచాడు. దాని కోసం ట్రీట్మెంట్లో భాగంగా.. బల్సనారో చాలాసార్లు సర్జరీ కూడా చేయించుకున్నారు. తాజా స్కిన్ క్యాన్సర్ గురించి కూడా బల్సనారో చికిత్స పొందారు. ప్రస్తుతం బాత్రూమ్లో జారిపడటంతో బల్సనారోకు ఆరోగ్య సమస్యలు పెరిగాయి.
* తుళ్లూరు పోలీసు స్టేషన్లో మహిళల పిర్యాదు. తమ ఎమ్మెల్యే కన్పించడం లేదని పోలీసులకు పిర్యాదు. వారం రోజులుగా రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నా ఎమ్మెల్యే స్పందించడం లేదంటూ నిరసన. తుళ్లూరు పోలీసు స్టేషన్ కు ర్యాలీగా బయలుదేరిన మహిళలు.
* ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ప్రకటనపై వెల్లువెత్తుతున్న నిరసనలు నేటితో (మంగళవారంతో) ఏడో రోజుకు చేరాయి. రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలతోపాటు ప్రజా సంఘాలు, విద్యార్థులు ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా నిలుస్తున్నారు. తుళ్లూరులో టెంట్లు వేసేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నేడు మందడం రహదారిపై ఆందోళన చేపట్టేందుకు ఆ ప్రాంత రైతులు సిద్ధమయ్యారు. అప్రమత్తమైన పోలీసులు వారిని రోడ్డుపైకి రాకుండా అడ్డుకుంటున్నారు. కఅష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. న్యాయవాదులు ‘చలో హైకోర్టు’కు పిలుపునిచ్చారు. ‘సేవ్ అమరావతి’ పేరిట సిద్ధార్థ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో ర్యాలీ నిర్వహించారు.
* ఢిల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నరేలా ప్రాంతంలో షూ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. పక్కనే ఉన్న మరో రెండు ఫ్యాక్టరీలకు మంటలు అంటుకున్నాయి. ఫ్యాక్టరీలో సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని 22 ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.
* పలువురు సినీ ప్రముఖల ఇళ్లలో జీఎస్టీ అధికారులు మంగళవారం దాడుల చేపట్టారు. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుల, నిర్మాతల ఇళ్లలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తంగా 15 మంది ప్రముఖుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రముఖ బిల్డర్స్, స్టీల్ వ్యాపారులు, ఫైనాన్స్ సంస్థలపై సోదాలు జరుగుతున్నాయి. ఆదాయం తక్కువగా చూపి ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొట్టారనే ఆరోపణలు రావడంతో అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం.
* కరెంట్ షాక్ తగిలి కౌలు రైతు మృతి చెందిన ఘటన మంగళవారం ఆలమూరు లో చోటు చేసుకుంది. స్థానిక వివరాల మేరకు. పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామంలోని వసంతాడ ప్రకాశం (35) వ్యవసాయ కూలీగా చేస్తూ కౌలు రైతుగా 4 ఎకరాలకు వ్యవసాయ సాగు చేస్తున్నాడు. ఈరోజు ఉదయం పొలానికి నీరు పెట్టేందుకుగాను గెడకు ఇనుప తీగను తగిలించి నీళ్లకు అడ్డుగా ఉన్న చెత్తను తొలగించేందుకు రోడ్డు గుండా ఇనుప తీగను తీసుకెళుతుండగా.. ఇనుప తీగ రోడ్డుపై ఉన్న కరెంట్ తీగలకు తగిలింది. దీంతో రైతుకు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. రైతుకు భార్య, ముగ్గురు పిల్లలు.. (ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి) ఉన్నారు. కౌలు రైతు మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
* ముదిగుబ్బ మండలం సానేవారిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. జేసీబీ పనులు చేస్తుండగా 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎనుములవారిపల్లి, మల్లమ్మకొట్టాలకు చెందిన అంజిత్ కుమార్ (18), పవన్ కల్యాణ్ (24) ఇద్దరూ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. నేడు ఇద్దరూ ముస్లిం స్మశాన వాటికకు చదును చేస్తుండగా 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.