భారత దేశం ఇతిహాసాలకు పుట్టినిల్లు. వీటిల్లో కొన్నింటిని తెరపైకి తీసుకురావడం అంత సాధారణమైన విషయం కాదనే చెప్పాలి. ఇప్పటికే రామాయాణ, మహాభారతాలను చిత్రాలుగా తెరకెక్కించేందుకు బాలీవుడ్ నిర్మాత మధు మంతెన ప్రయత్నాలు చేస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మహాభారతాన్ని రెండు భాగాలుగా చిత్రీకరించనున్నారని బాలీవుడ్‌లో మాట్లాడుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం.. బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో దీపిక ద్రౌపది పాత్రలో నటించనున్నట్లు ఇప్పటికే ఆమె ప్రకటించింది. తాజాగా ఈ సినిమాలో గ్రీక్‌గాడ్‌గా పేరు పొందిన హృతిక్ రోషన్ కృష్ణుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. మహాభారతం అంటే గుర్తొచ్చేది ద్రౌపది, కృష్ణుడే. కనుక అటువంటి పాత్రలను చేయడానికి వీరిద్దరే సరిపోతారని చిత్రబృందం భావిస్తోందిట. మహాభారతం మొదటి భాగాన్ని 2021 దీపావళి పండుగ నాటికి తెరపైకి తీసుకొచ్చేందుకు మధు మంతెన సన్నాహాలు చేస్తున్నారట. మధు మంతెనకు నటుడు హృతిక్‌తో చాలా మంచి సంబంధం ఉంది. ఈ ఏడాది విడుదలైన ‘సూపర్ 30’ చిత్రానికి మధు నిర్మాతగా వ్యవహరించారు.
ద్రౌపది కృష్ణులుగా…
Related tags :