WorldWonders

భారతీయులు సగటున ప్రతి నిమిషానికి 95 బిర్యానీలు

Indians Want 95 Biryanis Per Minute-Telugu WolrdWonders

ఉదయం.. మధ్యాహ్నం.. అర్ధరాత్రి సమయం ఏదైనా.. నోరూరించే బిర్యానీ ఆస్వాదించేందుకు భోజన ప్రియుల ఇష్టపడుతున్నారు. వారాంతపు వేళల్లో అయితే ఇంటిల్లిపాదీ ఎంచక్కా పసందైన మిఠాయిలు.. మనసుకు నచ్చిన మాంసాహార వంటకాలకే మొగ్గుచూపుతున్నారు. ఇదంతా సాధారణంగా చెబుతున్న విషయం కాదు. ఆహార పదార్థాలను గుమ్మం వరకు చేరవేసే ఓ సంస్థ ఈ ఏడాది దేశవ్యాప్తంగా పలు నగరాల్లో తాము అందజేసిన ఆహార పదార్థాల వివరాలను తెలిపింది. దేశవ్యాప్తంగా భారతీయులు సగటున ప్రతి నిమిషానికి 95 బిర్యానీలు కావాలంటూ కోరినట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 35,056 రకాల బిర్యానీలున్నాయి. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం అంతర్జాలం, యాప్‌లు వినియోగించే వారి సంఖ్య 306 శాతం పెరగటం విశేషం. హైదరాబాద్‌, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో బిర్యానీతోపాటు.. గులాబ్‌జామున్‌ ఇష్టంగా ఆస్వాదించారు. డెంగీ జ్వరం విజృంభించినపుడు బొప్పాయి ఆకులు కూడా పెద్దఎత్తున డెలివరీ చేశామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.