DailyDose

రేపు ఏపీ కేబినెట్‌ భేటీ-తాజావార్తలు-12/26

AP Cabinet To Meet Tomorrow-Telugu Breaking News Roundup Today-12/26

* రేపు ఉదయం 11 గంటలకు ఏపీ రాష్ట్ర మంత్రి వర్గం భేటీ కానుంది. రేపటి సమావేశానికి అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తొలుత సచివాలయంలోనే మంత్రివర్గం భేటీ నిర్వహించాలని భావించినప్పటికీ.. రాజధాని ప్రాంత రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తారా? లేదా సచివాలయంలోనే నిర్వహిస్తారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మంత్రివర్గ భేటీలో మూడు రాజధానుల అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు

* ప్రజలు, విద్యార్థులను హింసకు ఉసిగొల్పడం నాయకత్వం కాదని భారత సైన్యాధిపతి బిపిన్ రావత్ ఉద్ఘాటించారు.

నిజమైన నాయకుడు ప్రజలను సరైన మార్గంలో నడిపిస్తాడన్నారు. దేశంలో పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో రావత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ గౌరవార్థం పుదుచ్చేరిలో భారీ చాక్లెట్ విగ్రహాన్ని రూపొందించారు. ఓ కేఫ్లో 5 అడుగుల 10 అంగుళాల ఎత్తుతో 321 కేజీల విగ్రహాన్ని తయారుచేశారు. ఈ ప్రతిమను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

* పిలిప్పీన్స్‌ దేశంలో తుపాను తీవ్రరూపం దాల్చింది. ఒక్కసారిగా విరుచుకుపడిన ఫాన్ఫోన్‌ తుపాను జనజీవనాన్ని స్తంభింపజేసింది. ఫాన్ఫోన్‌ విలయంతో 16 మంది మరణించగా, మరికొందరు గల్లంతయ్యారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. తుపాను తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తుపాను ప్రభావంతో చెట్లు విరిగిపడుతున్నాయి. చాలాచోట్ల ఇళ్లు కూడా కూలాయి.

* దేశంలోనే తొలిసారి ట్రాన్స్‌‌జెండర్ల కోసం ప్రత్యేకంగా ఓ యూనివర్సిటీ ఏర్పాటవబోతోంది. ఉత్తరప్రదేశ్‌‌లోని కుషినగర్‌‌ జిల్లాలో ఆలిండియా ట్రాన్స్‌‌జెండర్‌‌ ఎడ్యుకేషన్‌‌ సర్వీస్‌‌ ట్రస్టు (ఏఐటీఈఎస్‌‌టీ) దీన్ని నిర్మించనుంది. వర్సిటీ కోసం ఇప్పటికే పని మొదలైందని, ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఇక్కడ చదువుకోవచ్చని, పీహెచ్‌‌డీ కూడా చేయొచ్చని ట్రస్టు ప్రెసిడెంట్‌‌ కృష్ణ మోహన్‌‌ మిశ్రా చెప్పారు. కమ్యూనిటీ మెంబర్లు పెంచుకుంటున్న ఇద్దరు చిన్నారులు వచ్చే ఏడాది జనవరి 15న వర్సిటీలో ఫస్ట్‌‌ అడ్మిషన్‌‌ తీసుకుంటారని.. ఫిబ్రవరి, మార్చి నుంచి క్లాసులు మొదలవుతాయని తెలిపారు. వర్సిటీ వల్ల ట్రాన్స్‌‌జెండర్‌‌ కమ్యూనిటీ చదువుకునే అవకాశాలు పెరుగుతాయని, వీళ్లు విద్యావంతులై దేశానికి కొత్త దారి చూపించగలుగుతారని ఎమ్మెల్యే గంగాసింగ్‌‌ అన్నారు. వర్సిటీ ఏర్పాటుపై ట్రాన్స్‌‌జెండర్‌‌ కమ్యూనిటీ కూడా సంతోషం వ్యక్తం చేసింది. ‘వర్సిటీతో మా లైఫ్‌‌ మారిపోతుంది. చదువుతో మాక్కూడా సొసైటీలో గౌరవం పెరుగుతుంది’ అని ఆ కమ్యూనిటీ మెంబర్‌‌ గుడ్డి కిన్నార్‌‌ అన్నారు.

* ఈ నెల 28న విశాఖలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశాఖలో రూ.1290 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపనలు చేస్తారని వెల్లడించారు.

*విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని , రాజధాని మార్పు విషయంలో జరుగుతున్న ధర్నాలో పాల్గొనకుండా ముందస్తుగా ఆయన నివాసం వద్ద హౌస్ అరెస్ట్ చేసిన విజయవాడ పోలీసులు

*ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ కోసం సేకరించాల్సిన ప్రైవేట్ భూముల భారం పెరిగింది.ఉగాది నాటికి 25 లక్షల మందికి ఉచితంగా ఇంటి స్థలాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతానికి 22.34 లక్షల మందికి అర్హత ఉన్నట్లు గుర్తించారు.

*అమరావతి రైతుల పోరాటం కొనసాగుతూనే ఉంది. సచివాలయంలో రేపు మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొనగా పోలీసులు రైతులకు నోటీసులు జారీచేశారు. ప్రభుత్వం తప్పు చేసిందనే దానికి తమకు నోటీసులు ఇవ్వడమే నిదర్శనమని రైతులు పేర్కొన్నారు.

*తెదేపా నేత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి హఠాన్మరణం చెందారు. గురువారం తెల్లవారు జామున ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. ఆయన అప్పటికే మృతి చెందినట్టు నిర్థరించారు. బడేటి కోట రామారావు (బుజ్జి) దివంగత సినీ నటుడు ఎస్వీ రంగారావు మేనల్లుడు. గతంలో బుజ్జి మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. 2014- 2019 మధ్య ఏలూరు ఎమ్మెల్యేగా సేవలందించారు.

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా టిడిపి సీనియర్ నేత, మాజీ ఎంఎల్ఎ బడేటి బుజ్జి గుండెపోటుతో కన్నుమూశారు. గురువారం వేకువజామున 2.30 నిమిషాలకు గుండెపోటు రావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే బుజ్జి చనిపోయారని ఆస్పత్రివర్గాలు వెల్లడించాయి. బుజ్జి ఏలూరు ఎంఎల్ఎగా 2014 నుంచి 2019వరకు ప్రజలకు సేవలందించారు. బుజ్జి మృతిపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యుల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఫోన్ చేసి పరామర్శించారు.

*జనవరి 21వ తేదీన ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు హాజరుకానున్నట్లు సమాచారం. అధికారికంగా ఉపరాష్ట్రపతి పర్యటన ఖరారు కానప్పటికీ అనధికారికంగా ఖరారైనట్లు తెలుస్తున్నది. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని జనవరి 21 ప్రారంభించనున్నట్లు స్వయంగా వెంకయ్యనాయుడే బుధవారం విజయవాడలో ప్రకటించడం గమనార్హం.

*ఉస్మానియా విశ్వవిద్యాలయంతో ఎంవోయూ కుదుర్చుకొని సంయుక్తంగా పరిశోధన చేసేందుకు, అనుభవాన్ని పంచుకునేందుకు అమెరికాకు చెందిన పెన్సిల్వేనియా, డ్రెక్సెల్ వర్సిటీలు ముందుకు రాలేదు

*నేటి సమాజంలో కాల్పనిక కథల కంటే వాస్తవికతతో కూడిన కథలకు, వాటి రచయితలకు విలువ ఉందని అంపశయ్య నవీన్ పేర్కొన్నారు.

*రాష్ట్రంలో నవంబరు నెలలో పన్నుల రాబడి అక్టోబరు కంటే మెరుగైంది. అన్ని పన్నుల ద్వారా అక్టోబరు కంటే నవంబరులో రూ.9114 కోట్లు అధికంగా వచ్చింది. గత నెలాఖరు నాటికి రాష్ట్రంలోని పన్ను రాబడుల లక్ష్యంలో 59 శాతానికి చేరుకుంది. కేంద్ర పన్నుల వాటా మాత్రం లక్ష్యంలో 52 శాతానికి పరిమితమైంది.

*పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న రెగ్యులర్ మ్యాజిక్ సర్టిఫికెట్ కోర్సు(2019-20)లో చేరేందుకు ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వివరాలకు 9059794553 ను సంప్రదించాలి

*సమగ్ర శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) కింద రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఈ సారి చివరి విడతగా రూ.452.62 కోట్లను విడుదల చేసింది. వాటికి రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటా(రూ.301.75 కోట్లు) కలిపి మొత్తం రూ.754.36 కోట్లు పాఠశాల విద్యాశాఖకు విడుదల చేయాల్సి ఉంది.

*ప్రధాని నరేంద్ర మోదీని మొదట్లో కాస్త అనుమానించాం. కానీ భారత్ను ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఎంతగానో నమ్ముతున్నాయి. మోదీ గల్ఫ్కు చాలాసార్లు వచ్చారు. ఆయన కేవలం రాజకీయ నాయకుడే కాదు. గుజరాత్ను నంబర్ 1 రాష్ట్రంగా నిలిపిన వ్యక్తి. ఖతర్లో ఐదు లక్షల మంది భారతీయులు ఉన్నారు. వారిని హిందువులు, ముస్లింలు అని వేరుగా చూడబోం.

*ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు కల్పించేందుకు గాను ఈ నెల 30న జాబ్మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జయప్రదా బాయి ఒక ప్రకటనలో తెలిపారు.

* టాస్క్ఫోర్స్ పోలీసులు ఖమ్మం జిల్లా కేంద్రంలో దాడులు చేసి భారీగా గుట్కాలను పట్టుకున్నారు. మహారాష్ట్ర, బీదర్ ప్రాంతాల్లో నుంచి అక్రమంగా తెచ్చి ఖమ్మం పట్టణంలోని ప్రకాశ్ నగర్ వద్ద గోదాములో నిల్వ ఉంచారు.