*బంగారానికి డిమాడ్ ఉండనే ఉంటుంది. మరి ఎందుకని అసంఘటిత బంగారం వ్యాపారాలు చేతులేట్టేది గోల్డ్ బిజినెస్ నుంచి తప్పుకుంటున్నారు? దీనికి ఒకటి రెండు కాదుచాలా కారణాలే ఉన్నాయి బంగారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం లేదు. పసిడిపై భారతీయులకు మక్కువ పెళ్ళిళ్ళు పండుగల వస్తే చాలు కస్టమర్లతో బంగారం షాపులు కిటకిట లాడుతున్నాయి కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ట్రెండ్ రివర్స్ అయ్యింది బంగారం షాపులు మూట పడుతున్నాయి. దేశంలో గత 2-3 ఏళ్ళల్లో దేశంలో చాలా మంది గోల్డ్ బిజినెస్ నుంచి వైదొలిగారు.
* దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే బలహీనంగా ఉన్న సూచీలు మిడ్‌సెషన్ తరువాత మరింత క్షీణించాయి. సెన్సెక్స్ 185 పాయింట్లు నష్టంలతో 41277 వద్ద, నిఫ్టీ 56 పాయింట్లు క్షీణించి 12158 వద్ద కొనసాగుతున్నాయి. ఆటో, ఐటీ తప్ప దాదాపు అన్ని రంగాలు షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
* మొబైల్స్ తయారీదారు ఒప్పో.. రెనో 3 5జీ, రెనో 3 ప్రొ 5జీ పేరిట రెండు నూతన 5జీ స్మార్ట్‌ఫోన్లను చైనాలో విడుదల చేసింది. రెనో 3 5జీ స్మార్ట్‌ఫోన్‌లో.. 6.4 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 8/12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10, డ్యుయల్ సిమ్, 64, 8, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, 5జీ, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4025 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.
* రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తన ఆప్టికల్ ఫైబర్, టవర్ వ్యాపారాలను వేరు చేయడాన్ని (డీమెర్జర్) వ్యతిరేకిస్తూ ఆదాయపన్ను శాఖ దాఖలు చేసిన పిటిషన్‌ను జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) కొట్టివేసింది. జియో డిజిటల్ ఫైబర్ ప్రైవేటు లిమిటెడ్, రిలయన్స్ జియో ఇన్ఫ్రాటెల్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తన ఫైబర్, టవర్ వ్యాపారాలను వేరు చేయాలని నిర్ణయించుకుంది.
*’ఇండియాలో బ్యాంకింగ్ రంగం పురోగతి, ధోరణులు – 2018-19” అన్న అంశంపై భారతీయ రిజర్వుబ్యాంకు ఒక నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఆ నివేదిక చూస్తే బ్యాంకింగ్ రంగంలో మోసాల విషయంలో మాత్రం స్పష్టమైన పురోగతి కనిపిస్తోంది! బ్యాంకు మోసాల సంఖ్యలో 15 శాతం పెరుగుదల ఉందని, ఆ మోసాల్లో స్వాహా అయిన సొమ్ము మొత్తంలో 74 శాతం పెరుగుదల ఉన్నదని నివేదిక వెల్లడిస్తోంది! 2017-18 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల్లో ఆర్థిక మోసాల సంఖ్య 5,916.
*దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:40గంటల సమయంలో సెన్సెక్స్ 3 పాయింట్లు నష్టపోయి 41,457 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 1 పాయింట్ నష్టపోయి 12,213 వద్ద ట్రేడ్ అవుతోంది. యూఎస్ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.71.24 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో భారత్ పెట్రోలియం, మహీంద్రా అండ్ మహీంద్రా, బ్రిటానియా, యూపీఎల్, హిందుస్థాన్ పెట్రోలియం షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. భారతీ ఇన్‌ఫ్రాటెల్ లిమిటెడ్, భారతీ ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కోల్ ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
*దివాలా స్మృతికి మరిన్ని సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జారీ చేసే ఆర్డినెన్స్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన ట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు
*పన్ను రేట్లు పెంచితే తప్ప జీఎ్సటీ ఆదాయం పెరిగే అవకాశం లేదని అధికారుల కమిటీ తేల్చి చెప్పింది. ఇందుకోసం అయిదు శాతం శ్లాబులో ఉన్న కొన్ని వస్తు, సేవల్ని 12 శాతం శ్లాబులోకి, 12 శాతం శ్లాబులో ఉన్న కొన్ని వస్తు, సేవల్ని 18 శ్లాబులోకి మార్చాలని సిఫారసు చేసింది.
*మారుతీ ఉద్యోగ్ మాజీ ఎండీ జగదీష్ ఖట్టర్పై రూ.110 కోట్ల బ్యాంక్ రుణ మోసం కేసులో సీబీఐ కేసు నమోదు చేసింది. ఖట్టర్తోపాటు ఆయన కంపెనీ కార్నేషన్ ఆటో ఇండియా లిమిటెడ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్కు రూ.110 కోట్ల నష్టం కలిగించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొంది
*ఫోర్టిస్ హెల్త్కేర్ మాజీ ప్రమోటర్ మల్వీందర్ సింగ్ను మరో కేసులో అరెస్ట్ చేశారు. రెలిగేర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్(ఆర్ఎ్ఫఎల్)లో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఆరోపణలపై ఆయన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మల్వీందర్ ఇప్పటికే ఓ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. లక్ష్మీ విలాస్ బ్యాంక్లో డిపాజిట్ చేసిన రూ.400 కోట్లు, రూ.350 కోట్లు విలువైన రెండు ఎఫ్డీలను మల్వీందర్ సింగ్, ఆయన సోదరుడు శివిందర్ సింగ్ దుర్వినియోగపరిచినట్లు, ఇందుకు బ్యాంక్కు చెందిన కొందరు ఉద్యోగులు కూడా సహకరించారని ఆర్ఎ్ఫఎల్ ఆరోపించింది.
*ఇక ముందు తమ కంపెనీ పెట్రోల్తో నడిచే బీఎస్ 6 ప్రమాణాలతో కూడిన వాహనాలు మాత్రమే తయారుచేస్తుందని రెనో ఇండియా కంట్రీ సీఈఓ వెంకట్రామ్ మామిళ్లపల్లి తెలిపారు.
*గోఎయిర్ విమానయాన సంస్థ నడిపే ‘ఏ320 నియో’ విమానాల ఇంజన్ల భద్రతపై పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విమానాల్ని గోఎయిర్ సంస్థ, ప్రాట్ అండ్ విట్నీ (పీడబ్ల్యు) కంపెనీ తయారు చేసిన ఇంజన్లతో నడుపుతోంది.
*లోరాటాడైన్ జనరిక్ బిళ్లలను అమెరికా మార్కెట్లోకి విడుదల చేయడానికి గ్రాన్యూల్స్ చేసిన అబ్రివియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్ (ఏఎన్డీఏ)కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ ప్రాధికార సంస్థ (యూ ఎస్ఎ్ఫడీఏ) ఆమోదం తెలిపింది.
మూతపడుతున్న బంగారం షాపులు-వాణిజ్యం-12/26
Related tags :