*తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి భాజపాతో అమీతుమీకు రెడీ అవుతున్నారా? పౌరసత్వ సవరణ బిల్లు విషయంలో భాజపా వ్యతిరేక పక్షాలన్నిటిని ఏకం చేసేందుకు కేసీఆర్ సిద్దమవుతున్నడా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోండ్ పీఏఏ ఎన్నేర్సీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ముస్లీం లౌకికవాడా శక్తులలో ముఖ్యంగా యువతలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న నేపద్యంలో వారితో పాటుగా ఉద్యమించేదుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్మవుతున్నట్టు సమాచారం. అందులో భాగంగానే జనవరి 30 వ తేదీన మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా హైదరబాద్లో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నరను తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కాంగ్రెసేతర భాజపా యేతర పార్టీలతో ఫెస్దరాల్ ఫ్రంట్ నిర్మిస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆతరువాత వేలువేడిన లోక్ సభ ఫలితాల్లో భాజపా భారీ విజయాలు సాధించడంలో సానుకూల వాతావరణం లేదని గ్రహించి సైలెంట్ అయిపోయిన సబ్గతి తెలిసిందే. అయితే తెలంగాణలో భాజపా తన కార్యకలాపాలను విస్తరించేందుకు ఆరెస్సెస్ ద్వారా పావులు కడుపుతుందటం పై సి ఎం కేసీఆర్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది జాతీయ స్థాయిలో తానూ జరిపే పోరాటంలో లౌకిక వాదులు మైనార్టీలు వచ్చే ఎన్నికల్లో తనకు గట్టి అండగా నిలబడతారని కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. సిఏఏను అమలు చేయబోమని ఇప్పటికే కేరళ, బెంగాల్ , బీహార్ ఎపీలు ప్రకటించిన నేపద్యంలో తెలంగాణాల్లో ఆచట్టాన్ని నిలువరించే ప్రయత్నాలు మొదలయ్యాయి దీనిపైనే ఎంఐఎం అధిఎన్త అసదుద్దీన్ ఒవైసీ కేసీఆర్ ను కలిసారు. మహబూబ్ నగర్ లో ఈ అంశం పై సభ పెట్టిన అసదుద్దీన్ 27న నిజామాబాద్ లో మరో సభ నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ సభకు వచ్చే స్పందనను బట్టి హైదరాబాద్ లో భారీ సభను కేసీఆర్ ఏర్పాటు చేస్తారని సమాచారం.
* అమరావతిలో యుద్ధ వాతావరణం: యనమల
అమరావతిలో అప్రకటిత ఎమర్జెన్సీపై తెదేపా సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఓట్లు వేసినవాళ్లనే కాళ్లతో తొక్కుకుంటూ జగన్ మోహన్‌రెడ్డి వెళ్తున్నారని విమర్శించారు. ‘‘తన పనితీరును ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారు. అణచివేతతో అధికారాన్ని చలాయిస్తున్నారు. కేబినెట్ మీటింగ్ పేరుతో 29 గ్రామాల్లో అప్రకటిత ఎమర్జెన్సీ తెచ్చారు. అమరావతి ప్రాంతాన్ని పోలీసు మయంగా మార్చారు. వేలాది పోలీసులను నెల్లూరు, ప్రకాశం, సీమ జిల్లాల నుంచి దించారు
*పుదుచ్చేరి గవర్నర్ పై సిఎం ఫిర్యాదు
లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని వెనక్కి రప్పించాలని పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కోరారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, కేబినెట్ నిర్ణయాలకు ఆమె అడ్డుపడుతున్నారని, రాష్ట్రపతి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అన్నారు. ఈ నెల 23న ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఈ మేరకు రాష్ట్రపతికి మెమొరాండాన్ని సమర్పించినట్లు మీడియాకు తెలిపారు.
*విశాఖకు గొప్ప బహుమతిచ్చారు: విజయసాయి
రాజధానిపై రేపు జరిగే మంత్రివర్గ సమావేశానికి ముందు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలుచేశారు. సీఎం జగన్… విశాఖకు కార్యనిర్వాహక రాజధానిగా గొప్ప బహుమతి ఇచ్చారని పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించాక ఈనెల 28న తొలి సారి విశాఖ వస్తున్న జగన్‌కు కృతజ్ఞతగా విమానాశ్రయం నుంచి మానవహారం నిర్వహిస్తామని చెప్పారు. విశాఖ కార్యనిర్వాహక రాజధానికి కొందరు అడ్డుపుల్లలు వేస్తున్నారన్న విజయసాయి… భూ అక్రమాల ఆరోపణలను తోసిపుచ్చారు. విశాఖలో తనకు ఒక్క ఫ్లాట్ మాత్రమే ఉందని, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎలాంటి ఆస్తులు లేవని స్పష్టం చేశారు.
*విశాఖ తెదేపాలో ముసలం ‘
విశాఖ తెదేపా లో ముసలం మొదలైంది విశాఖ అర్బన్ తెదేపా అద్యక్షుడు రెహ్మాన్ పార్టీకి రాజేనామ చేసారు. ఎన్నార్సీ రాజధాని అంశాల్లో తెదేపా విఅఖరిని నిరసిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల క్రితం విషకకు చెందినా తెదేపా నేతలు సమావేశమయ్యారు. పార్టీ అధినేత జై అమరావతి అని రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా మాట్లాడటం పైన వారు అంతర్గత సమావేశంలో అభ్యంతరం వ్యక్తం చేసారు. పార్టీ తీరు ఎలా ఉనా తాము మాత్రం పరిపాలనా రాజధాని విశాఖలో రావాతాన్ని స్వాగతించారు. ఆసమయంలో ప్రస్తుత తెదేపా ఎమ్మెల్యేలతో పాటుగా కొందరు ముఖ్య నేతలు పాల్గొన్నారు అదే సమావేశంలో విశాఖ అర్బన్ తెదేపా అద్యక్షుడుగా ఉన్న రెహమాన్ సైతం హాజరయ్యారు. అయితే ఆయన తెదేపాకి రాజీనామా చేస్తూ నిర్ణయం ప్రకటించారు.
* అది టీఆర్ఎస్, ఎంఐఎం ఆడుతున్న డ్రామా: భట్టి
గాంధీ కావాలా? గాడ్సే కావాలా? పేరిట నిజామాబాద్‌లో సీఎం కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన ర్యాలీ.. టీఆర్ఎస్, ఎంఐఎంఆడుతున్న డ్రామా అని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాడ్లాడుతూ సీఏఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మొదటి నుంచి పోరాటం చేస్తోందన్నారు. వ్యతిరేకించే వారు ఎవరైనా తమ ఆందోళనలో పాల్గొనవచ్చునని పిలుపు ఇచ్చారు. కేసీఆర్ లౌకిక వాది అయితే 28న తమ ర్యాలీకి ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. మేము మొదటి నుంచి గాంధీ వాదాన్నే చెబుతున్నామని, ఇప్పుడు అందరూ అక్కడికే వచ్చి ఆగుతున్నారని భట్టి విక్రమార్క అన్నారు.
* నా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే : సీఎం జగన్
దిశ చట్టం అమలు కోసం తీసుకుంటున్న చర్యలపై సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హోంమంత్రి సుచరిత, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్‌తో పాటు అడ్వకేట్ జనరల్ శ్రీరాం హాజరయ్యారు. దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై నిశితంగా సమీఎించారు. ఇక, పోలీసు శాఖ పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న దానిపై అధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు.
* నిర్ణయం మారకపోతే.. నిరసనలు ఉద్ధృతం
ఏపీ రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రకటనపై శుక్రవారం జరిగే మంత్రి మండలి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు. కాదని, భిన్నంగా నిర్ణయం తీసుకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.
* అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ లేదా?: చంద్రబాబు
ధర్నాచౌక్‌లో భేటీకి వెళ్లకుండా నాయకులను అడ్డుకోవడం అప్రజాస్వామికమని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు.ఆ పార్టీ నాయకుల గృహనిర్బంధాలను ఆయన తీవ్రంగా ఖండించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తదితరులను గృహ నిర్బంధం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 29 గ్రామాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది పోలీసులను దింపి అమరావతి ప్రాంతాన్ని పోలీసు రాజ్యంగా చేశారని చంద్రబాబు విమర్శించారు. ‘ ఐదేళ్లుగా సజావుగా సాగే రాజధానిని వివాదాస్పదం చేశారు
* కాంగ్రెస్‌కు సావిత్రీబాయి ఫూలే గుడ్‌బై!
ఉత్తర ప్రదేశ్ మాజీ ఎంపీ సావిత్రీబాయి ఫూలే కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ ఏడాది మొదట్లో 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె.. సంవత్సరం కూడా తిరక్కుండానే ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో తన మాటకు విలువ లేకుండా పోయిందనీ.. అందుకే తాను రాజీనామా చేస్తున్నానని ఆమె ప్రకటించారు. తాను కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్టు సావిత్రిభాయి తెలిపారు.
* వారు మాత్రమే దేశంలో ఉండాలనడం దారుణం: రాఘవులు
ప్రధాని మోదీ హయాంలో లౌకిక ప్రజాస్వామ్య విలువలు ధ్వంసమయ్యాయని సీపీఎం నేత బీవీ రాఘవులు విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. హైందవ సంస్కృతిని అనుసరించే వారు మాత్రమే దేశంలో ఉండాలనడం దారుణమన్నారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న కేసీఆర్.. ఎన్‌ఆర్సీపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్‌పై లౌకికశక్తులను కలుపుకుని పోరాడతామని బీవీ రాఘవులు స్పష్టం చేశారు.
* ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమైంది. ఎన్నికల తేదీలపై నిర్ణయం తీసుకునేందుకు ఇవాళ ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులు ఢిల్లీలో సమావేశం అయ్యారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 22తో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగుస్తుండడంతో ఆ లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఢిల్లీలో జరుగుతున్న కీలక భేటీలో ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) సునీల్ అరోరా, ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) డాక్టర్ రణ్‌బీర్ సింగ్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సహా మరికొందరు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
* కాంగ్రెస్‌కు సావిత్రీబాయి ఫూలే గుడ్‌బై!
ఉత్తర ప్రదేశ్ మాజీ ఎంపీ సావిత్రీబాయి ఫూలే కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ ఏడాది మొదట్లో 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె.. సంవత్సరం కూడా తిరక్కుండానే ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో తన మాటకు విలువ లేకుండా పోయిందనీ.. అందుకే తాను రాజీనామా చేస్తున్నానని ఆమె ప్రకటించారు. తాను కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్టు సావిత్రిభాయి తెలిపారు.
* ఝార్ఖండ్ భాజపా అధ్యక్షుడు రాజీనామా
ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవికి లక్ష్మణ్ గిలువా రాజీనామా చేశారు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. చక్రధర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఝార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థి సుఖ్‌రామ్ చేతిలో ఓటమి పాలయ్యారు.ఇటీవల ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో హేమంత్ సొరెన్ నేతృత్వంలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్‌జేడీ కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం 81 స్థానాలకు గానూ ఈ కూటమి 47 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకుంది. డిసెంబర్ 29న జేఎంఎం అధినేత హేమంత్ సొరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
* జీవనశైలిలో వ్యాయామం ఒక భాగం: వెంకయ్య
వైద్యం చేసేవాడు నారాయణుడితో సమానమని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించిన వెంకయ్య..డెల్టా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజమహేంద్రవరంలో అనేక విద్యాలయాలు, వైద్యశాలలు వచ్చాయన్నారు. నైపుణ్యం కలిగిన వైద్యులతో ఆసుపత్రి ఏర్పాటైందని చెప్పారు. ఆరోగ్యమే మహా భాగ్యమని, ఆరోగ్యం బాగుంటే భాగ్యాన్ని సాధించవచ్చని సూచించారు.
* సుచరితకు వినతిపత్రం అందించిన రాజకీయ ఐకాస
ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రాజకీయ ఐకాస నేతలు హోంమంత్రి సుచరితను కలిసి వినతి పత్రం అందచేశారు. తొలుత ఇవాళ ఉదయం వారికి అపాయింట్‌మెంట్ ఇచ్చిన హోంమంత్రి.. తర్వాత రద్దు చేశారు. దీనిపై ఐకాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రజాభిప్రాయం తెలుసుకోవాలని డిమాండ్ చేశారు.
కొద్దిసేపటి తర్వాత హోంమంత్రి కార్యాలయం నుంచి ఐకాస నేతలకు పిలుపు వచ్చింది. వారంతా గుంటూరులోని హోంమంత్రి నివాసానికి వెళ్లి వినతి పత్రం అందచేశారు. రాజధాని విషయంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర నడిబొడ్డున ఉన్న రాజధానిని తరలించవద్దని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హోంమంత్రి రేపటి సమావేశంలో జిల్లా వాసుల అభిప్రాయాలను తెలిజేస్తామన్నారు.
*సొంత పార్టీ స్థాపిస్తా : బీజేపీ మాజీ ఎంపీ
భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ సావిత్రి భాయి ఫూలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఏడాది మార్చి 3వ తేదీన సావిత్రి భాయి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ సమక్షంలో చేరారు. అయితే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సావిత్రి భాయి గురువారం ప్రకటించారు. పార్టీలో తన మాటకు గుర్తింపు ఇవ్వట్లేదు అని ఆమె చెప్పారు. ఈ కారణంగానే పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పిన సావిత్రి భాయి.. త్వరలోనే కొత్త పార్టీని స్థాపిస్తానని స్పష్టం చేశారు. 2000 సంవత్సరంలో బీజేపీలో చేరిన పూలే 2002, 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె గెలుపొందారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో బహ్రైచ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు సావిత్ర భాయి ఎంపికయ్యారు.
*ఆర్ఎస్ఎస్ ప్రధాని అబద్ధాలు చెబుతున్నారు : రాహుల్ గాంధీ
దేశంలో ఎక్కడా డిటెన్షన్ సెంటర్లు లేవని ప్రధాని మోదీ చేసిన కామెంట్‌ను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుపట్టారు. మోదీని ఆర్ఎస్ఎస్ ప్రధాని అంటూ పోల్చిన రాహుల్.. ఆర్ఎస్ఎస్ ప్రధాన మంత్రి భారత మాతకు అబద్దాలు చెబుతున్నట్లు విమర్శించారు. తన ట్విట్టర్ ద్వారా రాహుల్ స్పందిస్తూ.. డిటెన్షన్ సెంటర్లపై మోదీ చేసిన కామెంట్లను ఓ వీడియోలో పోస్టు చేశారు. అదే వీడియోలో అస్సాంలో ఉన్న డిటెన్షన్ సెంటర్‌ను చూపించారు. ప్రధాని మోదీ ఈ అంశంపై అబద్దాలు చెబుతున్నట్లు తన ట్వీట్‌కు జూట్‌జూట్‌జూట్ అన్న హ్యాష్‌ట్యాగ్ ఇచ్చారు. ముస్లింలను డిటెన్షన్ సెంటర్లకు పంపిస్తున్నట్లు.. కాంగ్రెస్ పార్టీ, కొందరు అర్బన్ నక్సల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మోదీ ఇటీవల అన్నారు. ఎవర్నీ డిటెన్షన్ సెంటర్లకు పంపడం లేదన్నారు. కానీ ప్రధాని మోదీ అన్నీ అబద్దాలు చెబుతున్నట్లు రాహుల్ తన వీడియోలో ఆరోపించారు.
*కాంగ్రెస్, భాజపాలకు ధరావతు దక్కదు
పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపాలకు కనీసం ధరావతు దక్కే పరిస్థితి లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం ఆయన జనగామ జిల్లా కొడకండ్లలో మాట్లాడుతూ.. ఆ పార్టీలకు పురపాలిక ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదన్నారు. శాసనసభ ఎన్నికల్లో పలుచోట్ల ధరావతు దక్కించుకోలేని భాజపా నాయకులు ఊహల లోకంలో విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అందించని రీతిలో రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు సాగు నీరందించేందుకు రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
*మూడు రాజధానులు పిచ్చి ఆలోచన: కన్నా
రాజధాని కోసం రైతులు తమ భూములను త్యాగం చేశారని.. కానీ గత ప్రభుత్వం అభివృద్ధి చేయడంలో విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో రాజధానిని అభివృద్ధి చేస్తామని మాటిచ్చి ఇప్పుడు ఎందుకు తప్పారని ఆయన ప్రశ్నించారు. మందడం, వెలగపూడిలో రైతుల దీక్షలకు కన్నా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షాత్తు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధానిని మారుస్తామని అనడం అవివేకమన్నారు.
*కిరణ్ బేడీని వెనక్కి రప్పించండి: సీఎం
లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని వెనక్కి రప్పించాలని పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కోరారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, కేబినెట్ నిర్ణయాలకు ఆమె అడ్డుపడుతున్నారని, రాష్ట్రపతి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అన్నారు. ఈ నెల 23న ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఈ మేరకు రాష్ట్రపతికి మెమొరాండాన్ని సమర్పించినట్లు మీడియాకు తెలిపారు.
*ఆ విషయం పవారే నేర్పించారు: ఉద్ధవ్
ప్రత్యర్థి కంటే తక్కువ సీట్లు వచ్చినప్పటికీ ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేయాలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తనకు నేర్పించారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. వసంత్దాదా సుగర్ ఇన్స్టిట్యూట్ వార్షిక సాధారణ సమావేశంలో ఆ సంస్థకు ఛైర్మన్గా ఉన్న పవార్తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ భూమిలో ఎక్కువ ఎలా పండించాలో నేర్పడంతో పాటు.. తక్కువ మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేయాలో పవార్ నేర్పించారని ఠాక్రే చెప్పారు. అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయామని పదే పదే చెబుతున్న మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్నుద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
*ప్రభుత్వ ఏర్పాటుకు హేమంత్కు ఆహ్వానం
ఝార్ఖండ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా హేమంత్ సోరెన్ను గవర్నర్ ద్రౌపదీ ముర్ము ఆహ్వానించారు. ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు తనను ఆహ్వానించాల్సిందిగా హేమంత్ మంగళవారం గవర్నర్ కలిసి ఎమ్మెల్యేల మద్దతు లేఖ సమర్పించిన సంగతి తెలిసిందే.
*దేశానికి వ్యతిరేకం పౌరసత్వ చట్టం
దేశానికి వ్యతిరేకంగా పౌరసత్వ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. బుధవారం ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో మాట్లాడుతూ.. ‘సైన్యంలో ఉన్నతస్థాయిలో పనిచేసిన వారికి సైతం పౌరసత్వం ఉండాలని చెప్పడం విడ్డూరంగా ఉంది. దేశానికి విరుద్ధంగా బంగ్లాదేశ్, పాకిస్థాన్ తదితర దేశాల్లో ముస్లింలు కాని వారిని గుర్తిస్తామని చెబుతున్నారు. కేంద్ర పాలకులు ఎగవేతదారులకు పెద్దపీట వేస్తున్నారు. పతంజలి గ్రూపు ఆస్తులు రూ.12 వేల కోట్లు ఉంటే రూ.4 వేల కోట్లు అని మభ్యపెడుతున్నారు.
*మాట తప్పిన ముఖ్యమంత్రి: కె.రామకృష్ణ
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు ముందు రాజధాని అమరావతికి మద్దతు పలికి.. నేడు మూడు రాజధానులని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. బుధవారం తిరుపతి సీపీఐ కార్యాలయంలో ‘ప్రజాస్వామ్యం- ప్రభుత్వాలు’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ‘అమరావతి ప్రాంతం శ్మశానంగా ఉందని స్పీకర్ అనడం బాధాకరం. దేశంలో కార్పొరేట్ శక్తులు రాజకీయాలను శాసిస్తున్నాయి. మోదీ, అమిత్షాలు నెలకో అజెండా తీసుకొచ్చి అరాచకం సృష్టిస్తున్నారు’ అంటూ మండిపడ్డారు.
*జగతి వ్యవహారం బయటపెట్టినందుకే కక్ష’
జగతి పబ్లికేషన్ షేర్ విలువ పెరగడం వెనక ఉన్న నిజాలను బయటపెట్టినందుకే ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిశోర్పై జగన్ కక్ష సాధిస్తున్నారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కృష్ణకిశోర్ హోదాని మార్చి సస్పెండ్ చేస్తారా? ఆయనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన జగన్ ప్రభుత్వం ఆ నివేదిక రాకుండానే అలా ఎలా చేస్తుంది?’ అని మండిపడ్డారు.