సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పలు ఆలయాలను అర్చకులు మూసివేశారు. గ్రహణం వీడిన తర్వాత శుద్ధి అనంతరం ఆలయాలు తెరుచుకోనున్నాయి. ఈ రోజు ఉదయం 7.59 గంటలకు ప్రారంభమైన సూర్యగ్రహణం మధ్యాహ్నం 12:30 గంటలకు ముగియనుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం మధ్యాహ్నం 12గంటల వరకు మూసివేయనున్నారు. తిరిగి మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత భక్తులకు సర్వదర్శనాన్ని కల్పించనున్నారు. సూర్యగ్రహణం సందర్భంగా ఆర్జిత సేవలు టీటీడీ రద్దు చేసింది. అలాగే కాణిపాకం ఆలయం మధ్యాహ్నం 12 గంటలకు తెరుచుకోనుంది. అటు యాదాద్రి ఆలయాన్ని మధ్యాహ్నం 12 గంటల వరకు మూసివేయనున్నారు. సంప్రోక్షణ తర్వత మధ్యాహ్నం 2 గంటలకు ఆలయం తెరుచుకోనుంది. బాసర సరస్వతి ఆలయం ఉదయం 11.30 గంటలకు తెరుచుకోనుంది. సంప్రోక్షణ అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. అన్నవరం ఆలయాన్ని మధ్యాహ్నం 3 గంటల వరకు మూసివేయనున్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ గుడిని సాయంత్రం 5 గంటల వరకు మూసివేయనున్నారు. ఆలయ శుద్ధి అనంతరం భక్తులను అనుమతించనున్నారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం మూసివేసిన అధికారులు సంప్రోక్షణ తర్వాత సాయంత్రం 3.30 గంటలకు భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు. సింహాద్రి అప్పన్న ఆలయాన్ని అర్చకులు మూసివేశారు. సాయంత్రం 4 గంటలకు అప్పన్న దర్శనానికి భక్తులకు అనుమతివ్వనున్నారు. శ్రీశైలం ఆలయంలో 11.30 గంటలకు మహాసంప్రోక్షణ జరుగనుంది.
తెరుచుకున్న తెలుగు ఆలయాలు
Related tags :