DailyDose

దుబాయిలో ఇద్దరు భారతీయుల మృతి-నేరవార్తలు-12/26

Two Indian Students Dead In Dubai-Telugu Crime News Roundup-12/26

*క్రిస్‌మస్ పండుగ రోజే దారుణం జరిగింది. దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ దారుణ ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. క్రిస్మస్ పార్టీని పూర్తి చేసుకొని రూమ్‌కు తిరిగి వెళ్తుండగా కేరళకు చెందిన రోహిత్ కృష్ణకుమార్ (19), శరత్ కుమార్ (21) ప్రమాదానికి గురై, అక్కడికక్కడే మరణించారు. కృష్ణకుమార్ యూకేలో, శరత్ కుమార్ యూఎస్‌లో చదువుతున్నాడు. వీరిద్దరూ అంతకుముందు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఇండియాకు వచ్చిన వారిద్దరు తమ కుటుంబాలతో కలిసి దుబాయ్‌కు విహారయాత్రకు వెళ్లారు. ఇంతలో ఘోరం జరిగింది. సరదాగా గడుపుదామని దుబాయ్‌కి వస్తే దుర్మరణం జరగడంతో వారి కుటుంబాలను విషాదంలోకి నెట్టాయి.

* చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది,చిత్తూరు జిల్లా కె.వి పల్లి మండలం మహల్ క్రాస్ వద్ద కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదంలో నలుగురి మృతి, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది

* బంజారాహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున అతి వేగంగా వెళ్తున్నకారు రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన మరో కారును ఢీ కొట్టి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

* నార్వే యువరాణి మాజీ భర్త ఆత్మహత్య. ప్రముఖ రచయిత, నార్వే యువరాణి మాజీ భర్త 47 ఏళ్ల అరీ బెన్ బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అరీ బెన్ 2002లో నార్వేజియన్ రాయల్ మెర్తా లూయిస్‌ను వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ కలిసి తమ వివాహబంధం గురించి తెలుపుతూ ‘ఫ్రమ్ హార్ట్ టూ హార్ట్’ అనే పుస్తకాన్ని కూడా రాశారు. బెన్ తన మొదటి పుస్తకాన్ని 1999లో ‘సాడ్ యాస్ హెల్’ పేరుతో ప్రచురించాడు. బెన్, తన భార్యతో ఆగస్టు 2016లో విడాకులు తీసుకున్నాడు. వారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నార్వే ప్రధాని ఎర్నా సోల్బెర్గ్ మరియు రాజ కుటుంబంతో సహా స్నేహితులు, బంధువులు అరీ బెన్ మృతికి సంతాపం తెలిపారు. ఆరీ చాలా సంవత్సరాలుగా మా కుటుంబంలో ఒకడుగా ఉన్నాడు. మాతో అతని జ్ఞాపకాలు ఎల్లప్పుడూ ఉంటాయని రాయల్ హౌస్ ఆఫ్ నార్వే ఒక ప్రకటనలో తెలిపింది. అరీ బెన్ తన ప్రాణాలను తీసుకున్నాడని చాలా బాధతో ప్రకటిస్తున్నామని ఆయన మేనేజర్ గీర్ హకోన్సుండ్ తెలిపారు. అరీ బెన్ అనేక నవలలు మరియు నాటకాలను కూడా రాశాడు. బెన్ 2018లో తన చివరి పుస్తకం ‘ఇన్ఫెర్నో’ను ప్రచురించాడు. ఈ పుస్తకంలో బెన్ తన మానసిక ఆరోగ్య సమస్యల గురించి వివరించాడు. బెన్ రచనలలో ‘బుక్ ఆన్ మెంటల్ హీత్’ చాలా ప్రాచుర్యం పొందింది.

*ఓనర్‌పై ఉన్న కోపంతో అతని కారును తగులబెట్టాడు ఓ డ్రైవర్‌. ఈ ఘటన కింగ్‌ కోఠిలో నిన్న రాత్రి చోటు చేసుకుంది. కారు యజమాని మాజ్‌ తన కారులో కింగ్‌ కోఠిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌కు వచ్చాడు. రోడ్డు పక్కనే కారు నిలిపి హాల్‌లోకి మాజ్‌ వెళ్లడాన్ని ఆ కారు డ్రైవర్‌ హుస్సేన్‌ చూశాడు.

*ఇప్పటి వరకు తాళాలు వేసిన ఇండ్లు, బ్యాంకులు లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు పాల్పడ్డ దొంగలు ప్రభుత్వ కార్యాలయాలను కూడా వదలడం లేదు. నెక్కొండ మండలంలోని రెడ్లవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు.

*పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నిన్న రాత్రి యురి సెక్టార్‌ వద్ద సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో భారత ఆర్మీకి చెందిన సుబేదార్‌ ప్రాణాలు కోల్పోయారు.

* పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ) నిరసనలు యూపీలోని వారణాసిలో ఓ ఏడాది చిన్నారికి చిక్కులు తెచ్చిపెట్టాయి. డిసెంబర్‌ 19న నగరంలో చేపట్టిన సీఏఏ నిరసనల్లో ఆ చిన్నారి తల్లిదండ్రులు అరెస్టు కావడమే ఇందుకు కారణం. ఏక్తా, రవి శేఖర్‌ దంపతులకు ఐరా అనే ఏడాది వయసు గల పాప ఉంది. వారు వారణాసిలో ‘క్లైమేట్‌ ఎజెండా’ పేరుతో ఎన్జీవో సంస్థను నడుపుతున్నారు

* దేశరాజధాని ఢిల్లీలో వరుస అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈస్ట్ ఢిల్లీలోని కృష్ణానగర్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో చిక్కుకున్న 40 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈరోజు తెల్లవారుజామున 2 గంటల సమయంలో కృష్ణానగర్‌లోని నాలుగంతస్థుల భవనంలో ఈ ప్రమాదం జరిగింది. బిల్డింగ్‌లోని ఫస్ట్ ఫ్లోర్‌లో ప్లాస్టిక్ వేస్ట్ గోదాము ఉంది. ఇక్కడ అంటుకున్న మంటలు బిల్డింగ్ అంతటా వ్యాపించాయని తెలుస్తోంది.

* ట్రాన్స్జెండర్పై ఓ ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం చేసిన ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బాచుపల్లి నుంచి ఐడీఏ బొల్లారం వెళ్లడానికి ఆటో ఎక్కగా.. డ్రైవర్ఆటోను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని ఓ ట్రాన్స్జెండర్ పోలీసులకు కంప్లైంట్ చేసింది.

* ఫేస్బుక్లో నకిలీ ఖాతా తెరిచి, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ యువతులను వేధిస్తున్న ఓ యువకుడు చివరకు పోలీసులకు చిక్కి, జైలుపాలయ్యాడు. కూకట్పల్లిలో ఉంటున్న వేణు(21) ఫేస్బుక్లో ఫేక్ ఎకౌంట్ ఓపెన్చేశాడు. దానికి పూరీ ఆకాశ్‌‌ ఫొటో పెట్టి, అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టేవాడు. పూరీ ఆకాశేనని నమ్మిన యువతులతో మెసెంజర్లో చాట్చేస్తూ, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని మభ్యపెట్టేవాడు.

* అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని బోడులబండ గ్రామంలో బుధవారం జరిగింది.

* నా భర్తను రెండేళ్ల క్రితమే హత్య చేశా..నన్ను శిక్షించండి అంటూ ఓ మహిళ హర్యానా హోం మంత్రిని కోరింది. అంతేకాదు దీనికి సంబంధించి ఓ లెటర్ కూడా ఇచ్చింది. ఈ ఘటన హర్యానాలోని అంబాలాలో జరిగింది.

* కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్‌ కాల్వలోకి బోల్తా పడిన ఘటన వీరులపాడు మండలం పొన్నవరం గ్రామ శివారులో జరిగింది. ట్రాక్టర్‌ ఇంజన్‌ కింద డ్రైవర్‌తో సహా వ్యవసాయ కూలీలు ఇరుక్కుపోగా.. స్థానికులు వారిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో తమ్మిశెట్టి ధనలక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో రాజధాని ప్రాంత రైతు రమేశ్‌ కుమార్‌ ఆత్మ హత్యాయత్నం చేశాడు. పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా..పోలీసులు అడ్డుకున్నారు. రాజధాని నిర్మాణానికి తాను నాలుగు ఎకరాల భూమి ఇచ్చానన్న రమేశ్‌ కుమార్‌… అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

*మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన గీత కార్మికుడు అంతటి శంకరయ్య దురదృష్టావశాత్తు తాటిచెట్టుపై నుంచి జారి మరణించాడు. ఉదయాన్నే తాటి కల్లు తీయడానికి మోకు సాయంతో చెట్టు పైకి ఎక్కిన శంకరయ్య అదుపుతప్పి పడిపోయాడు.

*తాంబూలం ఫ్రీగా ఇవ్వలేదని షాపు యజమానిపై ఓ యువకుడు దాడి చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని అలంబాగ్‌లో మంగళవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.

*హైదరాబాద్‌ నగరంలోని మియాపూర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో యువకుడు కారు నడిపాడు. కారు అదుపు తప్పి బస్టాప్‌ పక్కనే నిలిపి ఉన్న ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారు నడుపుతున్న యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

*నిజామాబాద్‌ జిల్లాలోని యాంచ గ్రామ సమీపంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి రైలు పట్టాలపై చనిపోయాడు.

*హాజీపూర్‌ వరుస హత్యల కేసులో నేడు విచారణ జరుగుతోంది. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు హాజరుపర్చారు. నేడు నిందితుడి వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. సెక్షన్‌ 313 కింద నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి వాంగ్మూలాన్ని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నమోదు చేసింది. అనంతరం ఇరువైపుల న్యాయవాదుల వాదనను విననుంది. జనవరిలో ఈ కేసు విషయమై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉంది…

*ప్రియుడి కోసం ఓ యువతి హల్‌చల్‌ చేసింది. మణికొండ సమీపంలోని చిత్రపురి కాలనీకి చెందిన ఓ యువతి (22)కి మాదాపూర్‌లోని ఓ సంస్థలో సీనియర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న పెళ్లయిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది.

*హిందూపురం రూరల్ పూలకుంటలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు… అయితే ఈ హత్య జరిగి 20 రోజులైంది..స్థానిక పంట పొలాలలో పూర్తిగా పాడైపోయిన శవాన్నిచూసి రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకున్నారు.. హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని భావిస్తున్నారు.. హతుడు వివరాలు సేకరించి పనిలో పడ్డారు పోలీసులు.

*టేకు కలప లోడ్‌తో వెళుతున్న బండిని వెనుక నుండి లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన గురువారం వేకువజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు… వెంకంపేట గ్రామానికి చెందిన నెయ్యిగొప్పల నాగభూషణరావు (29), గొట్టాపు పాదాలు (50) స్వగ్రామం నుండి నాటు బండిలో టేకు కలపను కోత కోసం ఈరోజు వేకువజామున 4 గంటలకు షామిల్లుకు తరలిస్తుండగా.. మండలం పరిధిలోని వెంకమ్మ సాగరం వద్దకు వచ్చేసరికి పాలకొండ నుండి వస్తున్న లారీ వెనుక నుండి బండిని ఢీకొంది. ఈ ప్రమాదంలో నెయ్యిగొప్పల నాగభూషణరావు (29), గొట్టాపు పాదాలు (50) లు అక్కడికక్కడే మృతి చెందారు. పాలకొండ సిఐ ఎస్‌.ఆదాం సంఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గ్రామస్థులు కూడా అక్కడకు చేరుకొని రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

*జార్ఖండ్‌లోని బొకారో- రామ్‌గఢ్ రోడ్డుపై ఉల్లి బస్తాలతో నిండిన పికప్‌వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో వ్యానులో ఉన్న 72 బస్తాల ఉల్లి నేలపాలయ్యింది. విషయం తెలుసుకున్న కమలాపూర్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారంతా అక్కడకు చేరుకుని, తమకు తోచినంత ఉల్లిని తీసుకుపోయారు. అరగంటలో అక్కడున్న 35 క్విటాళ్ల ఉల్లి మాయమయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

*పెద్దమందడి మండలం చిల్కటోని పల్లి గ్రామ స్టేజి సమీపంలో, జాతీయ రహదారి 44 పై, ట్రాక్టర్ ను ఢీకొట్టిన లారీ. ఐదు గురికి తీవ్ర గాయాలు. పరిస్థితి విషమం. 108 అంబులెన్సు లో జిల్లా ఆసుపత్రి కి తరలింపు..

*పెళ్లి చేసుకుంటానని ఎయిర్‌హోస్టెస్‌ను నమ్మించి నాలుగేళ్లు సహజీవనం చేసి ఆమె నుంచి రూ.లక్షలు తీసుకుని తీరా పెళ్లి మాట ఎత్తేసరికి మొహం చాటేసిన విదేశీ యువకుడిని బంజారాహిల్స్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు

*గత నెల రోజుల వ్యవధిలో శబరిమలలో అయ్యప్ప దర్శనానికి వెళ్లిన భక్తుల్లో 19 మంది గుండెపోటుతో మృతిచెందారు. ఇందుకు సంబంధించిన వివరాలను ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు బుధవారం వెల్లడించింది. మృతిచెందిన 19 మందిలో 15 మంది స్వామివారి ఆలయానికి వెళ్తూ పంబా వద్ద కొండ ఎక్కుతూ తనువు చాలించారని తెలిపింది.

* శ్రీకాకుళం జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వీరఘట్టాం మండలం వెంకంపేట గ్రామం మరియగిరి కొండ వద్ద కలప లోడ్తో వెళ్తున్న ఎడ్లబండిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగభూషణం, పట్టాభి అనే ఇద్దరు రైతులు మృతి చెందారు.సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

*బంజారాహిల్స్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. గురువారం తెల్లవారుజామున ఏపీ 09 ఏపీ 0815 నెంబరు గల కారు అతివేగంతో వచ్చి రోడ్డు పక్కన పార్క్ చేసిన మరో కారును ఢీ కొట్టి.. ఫుట్ పాత్పైకి దూసుకెళ్లింది. దీంతో రోడ్లను శుభ్రం చేస్తున్న జీహెచ్ఎంసీ కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. కారులో ఉన్న ముగ్గురు యువకులను అత్తాపూర్కు చెందినవారిగా గుర్తించారు. అయితే వారు మద్యం మత్తులో వాహనం నడిపినట్టుగా స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

*మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని నసరుల్లాబాద్ శివారులో బుధవారం లారీ–ఆటో ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు.

*హైదరాబాద్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో దారుణం చోటుచేసుకుంది.

*గంజాయికి బానిసై, ఇతరులకూ దాన్ని విక్రయిస్తున్న ఇద్దరు జేఎన్టీయూ విద్యార్థులు ఆబ్కారీ పోలీసులకు పట్టుబడ్డారు.

*తొమ్మిదేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఓ గిరిజన తండాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.

*అర్ధరాత్రి సమయంలో సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తిని విక్రయిస్తున్న దళారులను అన్నదాతలు పట్టుకొని పోలీసులకు అప్పగించిన వైనమిది. నల్గొండ జిల్లా మునుగోడులో ఈ ఘటన చోటుచేసుకుంది.

*హీరాగోల్డ్ కంపెనీపై నమోదు చేసిన కేసులను తీవ్ర మోసాల దర్యాపు సంస్థ అధికారి(సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటింగ్ అధికారి- ఎస్ఎఫ్ఐఓ)కి బదిలీ చేయాలంటూ హైకోర్టు మంగళవారం పోలీసులను ఆదేశించింది.

*బెంగళూరులోని ముత్తూట్ ఫైనాన్స్ కేంద్ర కార్యాలయ భవనానికి దొంగలు కన్నం వేసి రూ.16 కోట్ల విలువైన 70 కిలోల బంగారాన్ని చోరీ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పులికేశినగర పోలీసుస్టేషన్ పరిధిలోని లింగరాజపురంలో సంస్థ కార్యాలయం మరుగుదొడ్డి వైపు నుంచి గోడకు కన్నం వేసినట్లు పోలీసులు గుర్తించారు.

*ఏపీ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీలో సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు రావడంతో సోమ, మంగళవారాల్లో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. కీలక సమాచారానికి సంబంధించి దస్త్రాలు తనిఖీ చేసి, వివరాలు సేకరించారు.

*గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల పరిధిలో లైమ్స్టోన్ అక్రమ మైనింగ్, అక్రమ రవాణాపై నమోదైన 18 కేసులను రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది.

*చందానగర్ రైల్వేస్టేషన్ వద్ద రైలు పట్టాలు దాటుతూ ఇద్దరు మృతి చెందారు.

*పాతబస్తీకి చెందిన ఆస్మా బేగం శరీరంలో బుల్లెట్ దిగిన ఘటనలో పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బుల్లెట్ శరీరంలోకి ఎలా దూసుకెళ్లిందన్న దానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు.

*ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడింది. ఈ ఘటనలో కనీసం 24 మంది మృతిచెందగా.. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.

*వివాహేతర సంబంధం కొనసాగించాలని బెదిరించగా భయాందోళనకు గురై మైమున్నీసా ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక టౌన్ పోలీసులు తెలిపారు.

*మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం నస్రూల్లాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, ఆటో ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతుల్లో దంపతులు, ఏడాది చిన్నారి, దంపతుల బంధువు ఉన్నారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు