Devotional

2020 చివర్లో యాదాద్రి ప్రారంభం

Yadadri Begins In The End Of 2020

1.తెలుగు రాష్ట్రాల్లో సూర్యగ్రహణం సందడి
వ్యవహారిక భాషలో ‘గ్రహణాన్ని’ చెడుకు పర్యాయపదం గా వాడటం పరిపాటి. గ్రహణం పట్టింది, గ్రహణం వీడింది అనే పదాలు మన జీవితంలో కష్టసుఖాలకి అన్వయింప బడుతుంటాయి.సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాల, ఉపగ్రహాల వల్ల గ్రహణాలు ఏర్పడతాయ నే విషయం అందరికి తెలిసిందే. కానీ అనాది కాలం నుండి ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలలో గ్రహణాలపై ప్రజలలో అపోహలున్నాయి. వాటిలో కొన్ని నేటికీ కొనసాగుతున్నాయి. గ్రహణ సమయంలో వంట చేయకూడదని, తినకూడదని, ఏమీ త్రాగకూడదని, ఇలా చేస్తే చెడు ఫలితాలొస్తాయని మనదేశంలో నమ్ముతారు. అమెరికాలోని కొంతమంది గ్రహణాలు ఏర్పడటాన్ని సృష్టి వినాశనానికి సంకేతంగా భావిస్తారు. ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాలలో గ్రహణం ఏర్పడడమంటే సూర్య చంద్రులిద్దరూ కలిసి ఘర్షణ పడతారని నమ్ముతారు. చాలా దేశాల్లో గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలని బయటకి రావద్దని హెచ్చరిస్తారు. మరికొన్ని దేశాలలో గ్రహణాలు ఏర్పడితే భూకంపాలు వస్తాయని, తద్వారా మానవ వినాశనం జరుగుతుందని నమ్ముతారు. మన దేశంలో విస్తృతంగా ప్రచారంలో వున్న రాహు, కేతువుల కధ అందరికీ తెలిసిందే. గెలీలియో, కెప్లర్, కోపర్నికస్ వంటి ఖగోళ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ఫలితంగా సూర్యుడు, గ్రహాల గమనంపై మనకొక అవగాహన ఏర్పడింది. చంద్రుని నీడ భూమిపై పడటం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది అమావాస్య రోజు మాత్రమే జరుగుతుంది. సూర్య గ్రహణాలలో సంపూర్ణ, పాక్షిక, వలయాకార, మిశ్రమ సూర్య గ్రహణాలుంటాయి. భూమి యొక్క నీడ చంద్రునిపై పడినపుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది పౌర్ణమి రోజున మాత్రమే సంభవిస్తుంది. ర్యగ్రహణం ఏర్పడటం వలన పగటి వేళ కొద్ది సేపు రాత్రిని తలపిస్తుంది. అంతరిక్షంపై మనిషికి అవగాహన లేని రోజుల్లో ప్రజలు గ్రహణ సమయములో భయభ్రాంతులకు గురయ్యేవారు. ఆ రోజుల్లో టోలమీ ప్రతిపాదించిన ‘భూకేంద్రక సిద్ధాంతం’ ప్రాచుర్యంలో ఉండేది. ర్వాత కోపర్నికస్ ప్రతిపాదించిన ‘సూర్య కేంద్రక సిద్ధాంతం’ శాస్త్రీయంగా నిరూపించబడింది. ఈ సిద్ధాంతాన్ని సమర్ధించినందుకు గియనార్డో బ్రూనో వంటి శాస్త్రవేత్తలను ఆనాటి మతాధిపతులు హతమార్చారు. ప్రాచీన, మధ్య యుగాల్లో చలామణిలో వున్న మూఢ విశ్వాసాలని కరపత్రాల ద్వారా కంప్యూటర్ కాలంలో కూడా ప్రచారం చేసి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. గ్రహణాలని ఎవరైనా చూడవచ్చు. గ్రహణం మొర్రికి గ్రహణాలకు ఎటువంటి సంబంధం ఉండదు. అయితే నేరుగా కంటితో గ్రహణాలు చూడకూడదు. నాణ్యమైన సోలార్ ఫిల్టర్స్ ద్వారా గ్రహణాన్ని చూడవచ్చు. ఇప్పటికే జన విజ్ఞాన వేదిక వంటి సైన్స్ ప్రచార సంస్థలు గ్రహణాలపై విద్యార్ధులకు అవగాహన కల్పిస్తున్నాయి. పాఠశాలల్లో సైన్స్ ఉపాధ్యాయులు కూడా విద్యార్ధులకు ఇటువంటి విషయాలపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వారిలో శాస్త్రీయ ఆలోచనలు పెరుగుతాయి. మద్యం తాగేవాళ్లు తమ భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌ను హింసించే అవకాశం ‘ఆరు రెట్లు ఎక్కువ’‘మందు కొట్టని వాళ్లతో పోలిస్తే మందుకొట్టే వాళ్లు జీవిత భాగస్వాములను బెదిరించడం, దాడి చేయడం, లైంగిక దాడులకు పాల్పడే అవకాశం ఎక్కువ’ ద్యం లేదా మాదక ద్రవ్యాల మీద ఆధారపడే పురుషులు.. మహిళల మీద గృహ హింసకు పాల్పడే అవకాశం ఇతరులకన్నా ఆరు, ఏడు రెట్లు అధికంగా ఉంటుందని ఒక విస్తృత అధ్యయనంలో వెల్లడైంది.స్వీడన్‌లో 16 సంవత్సరాల పాటు నమోదు చేసిన లక్షలాది వైద్య రికార్డులు, పోలీస్ సమాచారాన్ని విశ్లేషిస్తూ నిర్వహించిన ఈ పరిశోధన వివరాలను ప్లాస్-మెడిసిన్ అనే ఆన్‌లైన్ జర్నల్‌లో ప్రచురించారు.మానసిక అనారోగ్యాలు, ప్రవర్తనా లోపాలు ఉన్న పురుషులు కూడా తమ భాగస్వాములపై హింసకు పాల్పడే అవకాశం అధికంగా ఉంటుందని ఈ పరిశోధన గుర్తించింది.యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ సీనా ఫజల్ ఈ అధ్యయనానికి సారథ్యం వహించారు. అమెరికా, స్వీడన్, లండన్ కింగ్స్ కాలేజ్‌లకు చెందిన నిపుణులు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు.మాదక ద్రవ్యాలు, మద్యపాన వ్యసనాలకు చికిత్స సేవలను మెరుగుపరచటంతో పాటు.. ఈ నేరాలకు పాల్పడే వారిని మరింత మెరుగుగా పర్యవేక్షించటం ద్వారా గృహ హింసను తగ్గించవచ్చునని తమ పరిశోధన ఫలితాలు చెప్తున్నాయని ప్రొఫెసర్ ఫజల్ తెలిపారు.ఈ అధ్యయనంలో.. 1998 జనవరి నుంచి 2013 డిసెంబర్ వరకు.. మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగం సమస్యలు ఉన్నట్లు వైద్యపరంగా గుర్తించిన 1,40,00 మంది పురుషుల వివరాలను సేకరించారు.వీరిలో ఆ తర్వాతి కాలంలో.. తమ భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్, మాజీ జీవితభాగస్వాములను బెదిరించటం, దాడి చేయటం, లైంగిక దాడులకు పాల్పడటం వంటి కేసుల్లో ఎంత మంది అరెస్ట్ అయ్యారనేది పరిశోధించారు.మద్యపాన వ్యసనపరుల్లో 1.7 శాతం మంది ఇలాంటి నేరాల కింద అరెస్టయ్యారని గుర్తించారు. అదే వయసులో ఉన్న మొత్తం పురుషుల్లో ఇటువంటి అరెస్టుల సగటుతో పోలిస్తే ఇది ఆరు రెట్లు అధికం.ఇక మాదకద్రవ్యాల వినియోగం సమస్య ఉన్న పురుషుల్లో అయితే 2.1 శాతం మంది గృహ హింస నేరాల కింద అరెస్టయ్యారని తేలింది. సాధారణ సగటుకన్నా ఇది ఏడు రెట్లు అధికం.మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగానికి – గృహ హింసకు మధ్య సంబంధం ఉందనేది నిస్సందేహమని ఈ పరిశోధన తేల్చింది. అయితే.. ఈ ఫలితాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోవాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్‌లో బాధితుల కమిషనర్ డేమ్ వెరా బాయిర్డ్ అంటారు.”మద్యం మత్తులో గృహ హింసకు పాల్పడే వాళ్లలో చాలా మంది మద్యం తాగకుండా ఉన్నప్పుడు కూడా హింసాత్మకంగా, బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తారు” అని ఆమె పేర్కొన్నారు.
”అలాగే గృహ హింసకు పాల్పడే వారిలో, నియంత్రించే పెత్తనం చలాయించే వారిలో చాలా మందికి మద్యపానం కానీ, మాదక ద్రవ్యాల అలవాటు కానీ లేదు. కాబట్టి.. గృహ హింసకు పాల్పడేవారి మీద కేంద్రీకరించాల్సిన వనరులను మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగాన్ని పరిష్కరించటానికి మళ్లించటం పొరపాటు అవుతుంది” అని ఆమె విశ్లేషించారు.
**మానసిక అనారోగ్యాలతో సంబంధం
మద్యపానం, మాదకద్రవ్యాలను వినియోగించే పురుషులు గృహ హింసకు పాల్పడే ప్రమాదం ఎక్కువగా ఉండటానికి.. కుటుంబ నేపథ్యం, జన్యువారసత్వం వంటి ఇతర అంశాలేవైనా కారణం కావచ్చునేమో తెలుసుకోవటానికి.. వారి ”సహోదరులతో పోల్చి” కూడా పోల్చిచూశారు పరిశోధకులు.మద్యం, మాదక ద్రవ్యాలను వినియోగించే వారిలో గృహ హింస నైజం అధికంగానే ఉందని.. అయితే.. ఇటువంటి అలవాట్లు లేని వారి సహోదరులతో పోల్చినపుడు ఈ నైజం కొంత తక్కువగా ఉందని ఈ పరిశీలనలో గుర్తించారు.”మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగం వల్ల.. ఒక వ్యక్తిలో సంశయాలను తగ్గిస్తాయి. అది.. సన్నిహిత సంబంధాల్లో సంఘర్షణలను పరిష్కరించుకోవటానికి హింసను ఉపయోగించటానికి దారితీయగలదు” అని ఈ పరిశోధన చెప్తోంది.కొన్ని మానసిక ఆరోగ్య సమస్యలకు, గృహ హింసకు సంబంధం ఉందని కూడా ఈ పరిశోధన గుర్తించింది. అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ), వ్యక్తిత్వ లోపాలు, వైద్యపరమైన కుంగుబాటు వంటి సమస్యలు ఉన్న వారు.. గృహ హింస కేసుల్లో అరెస్టయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
”మానసిక వైకల్యాలు ఉన్నవారు.. తమ రుగ్మతలకు సంబంధించిన లక్షణాలను ఎదుర్కొనే వ్యూహాల్లో భాగంగా మద్యం, మాదకద్రవ్యాలను ఉపయోగించే అవకాశం అధికంగా ఉంటుంది” అని ఈ అధ్యయనం చెప్తోంది.”కాబట్టి మానసిక వైకల్యాలకు గృహ హింసకు అంతర్లీనంగా సంబంధాన్ని ఏర్పరిచేది మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగం కావచ్చు” అని విశ్లేషించింది.
2. నేడు పాక్షిక సూర్యగ్రహణం
సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు ప్రవేశించడంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. తెలుగు రాష్ట్రాలలో మార్గశిర అమావాస్య డిసెంబర్ 26 గురువారం 2019 న ఉదయం 8:08 నిముషాలకు సూర్యగ్రహణ స్పర్శ ప్రారంభమై మధ్యకాలం 9:30 చేరుకుంటుంది. ఉదయం 11 :10 నిమిషాలకు ముగుస్తుంది. పగలు నిర్వహించే పితృకార్యాలను గ్రహణం తరువాత శుద్ధి చేసుకుని ప్రారంభించుకోవాలి.
* తెల్లవారిన తరువాత ఆహారం తీసుకోకూడదు. గ్రహణ సమయంలో అసలే పనికిరాదు. ఈ సూర్య గ్రహణం మూలా నక్షత్రము, ధనుస్సు రాశిలో సంభవించనుంది కాబట్టి మూలా నక్షత్రంలో లేదా ధనుస్సు రాశిలో జన్మించిన వారు సూర్య గ్రహణాన్ని చూడకూడదు.
* గర్భిణులు గ్రహణ సమయంలో ఇంట్లోనే ఉండాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ధ్యానం, జపం, ఆధ్యాత్మిక చింతనతో ఉంటే చాలా మంచిది. గ్రహణ సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలు లేదా పానీయాలు నిలువ ఉంచకూడదు. ఒకవేళ తప్పనిసరై ఊరగాయ పచ్చళ్ళు వంటివి నిల్వ ఉంచవలసినట్లయితే వాటిమీద దర్భ పుల్లలు ఉంచాలి. వెండితో చేసిన సూర్యచంద్రబింబాలను శక్తిమేరకు దానం చేయడం మంచిది.
* గ్రహణం పూర్తయిన తరువాత తప్పనిసరిగా విడుపు స్నానం చేయాలి. తరువాత యజ్ఞోపవీతం ధరించే వారైతే నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి. గ్రహణం విడిచిన వెంటనే దేవతా విగ్రహాలను, ఇంటినీ, ఇంటి పరిసరాలను శుద్ధి చేసుకోవాలి. శివాలయాన్ని దర్శించి, అవకాశముంటే అభిషేకం చేయించుకోవాలి.
* సూర్యగ్రహణం సంభవిస్తున్నప్పుడు ముందు, వెనుక రోజులతో పాటు మూడురోజుల పాటు శుభకార్యాలేవీ చేయకూడదు. అంటే డిసెంబర్ 25 నుంచి 27 వరకు శుభకార్య నిర్వహణలు ఉండవు. భారతదేశంలోనే కాకుండా, సౌదీ అరేబియా, సుమత్రా, బార్నియో లాంటి ప్రాంతాల్లో కూడా సూర్యగ్రహణం దర్శనమిస్తుంది.
3.బంగారు డాలర్ల కొనుగోలుకు ఆన్లైన్లో చెల్లింపులు
శ్రీవారి ప్రతిమతో కూడిన బంగారు డాలర్ల కొనుగోలుకు ఆన్లైన్లో చెల్లింపులకుగాను తొలిదశలో శ్రీవాణి ట్రస్టు దాతలకు అవకాశం కల్పించేలా సాఫ్ట్వేర్ రూపొందించాలని తితిదే ఈవో అనిల్కుమార్ సింఘాల్ ఆదేశించారు. ఈమేరకు తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో బుధవారం ఐటీ అధికారులతో సమీక్షలో ఆయన మాట్లాడారు.
4.మధ్యాహ్నం తర్వాతే శ్రీవారి దర్శనం
సూర్యగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ తలుపులను తితిదే బుధవారం రాత్రి 11 గంటలకు శాస్త్రోక్తంగా మూసివేసింది. గురువారం ఉదయం సూర్యగ్రహణం ఉన్నందున.. మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ తలుపులు తెరచి శుద్ధి చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
5.నేడు ఆలయాలన్నీ మూసివేత
సూర్య గ్రహణం సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా ఆలయాలన్నింటినీ గురువారం ఉదయం మూసివేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. సూర్యగ్రహణం గురువారం ఉదయం 8గంటల 11నిమిషాలకు మొదలై 11గం.40ని.కి ముగుస్తుందని రాష్ట్ర అర్చక సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు. నిత్యం పూజా కార్యక్రమాలను నిర్వహించే 12,265 ఆలయాలనూ గురువారం మధ్యాహ్నం వరకు మూసి ఉంచుతారని చెప్పారు.
6. రాశిఫలం – 26/12/2019
తిథి:
బహుళ అమావాస్య ఉ.10.15, కలియుగం-5121 ,శాలివాహన శకం-1941
నక్షత్రం:
మూల సా.4.57
వర్జ్యం:
మ.3.20 నుండి 4.57 వరకు, తిరిగి రా.2.46 నుండి 4.24 వరకు
దుర్ముహూర్తం:
విశేషాలు: సూర్యగ్రహణం
రాహు కాలం:
మ.1.30 నుండి 3.00 వరకు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా వుంటుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. మెలకువగా నుండుట అవసరం. స్థానచలన మేర్పడే అవకాశాలుంటాయి. ఋణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా నుండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలుంటాయి.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశముంటుంది. ధననష్టాన్ని అధిగమించుటకు ఋణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు వుంటాయి.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరును. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాలవల్ల లాభం చేకూరును. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) కోపాన్ని అదుపులో నుంచుకొనుట మంచిది. మానసికాందోళనను తొలగించుటకు దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా నుండవు. వృధా ప్రయాణాలెక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులుండవు.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం. బంధు, మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది. ఋణప్రయత్నాలు చేస్తారు.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవడంతో ఇబ్బంది పడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశముంటుంది.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభముంటుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ప్రయత్నం మేరకు స్వల్పలాభముంటుంది. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలుంటాయి. ఋణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) సంపూర్ణ ఆరోగ్యంగా వుంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) ప్రయత్న కార్యాలందు దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తిప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) తలచిన కార్యాలన్నియు విజయవంతంగా పూర్తిచేసుకోగలుగుతారు. బంధు మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలుండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులేర్పడతాయి.
7. సంపూర్ణ సూర్యగ్రహణం గురువారం రానున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని 13 గంటల పాటు మూసివేస్తారు. బుధవారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయం తలుపులు మూసివేశారు. తిరిగి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీవారి ఆలయం తలుపులు తెరుస్తారు. అనంతరం ఆలయ శుద్ధి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇదిలా ఉండగా తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. గ్రహణం కారణంగా శ్రీవారి దర్శనాలు నిలిపివేస్తుండటంతో బుధవారం తిరుమలకు వచ్చిన భక్తులను ఉదయం 7 నుంచే వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోకి అనుమతించకుండా అధికారులు నిలిపివేశారు. అయితే అప్పటికే వైకుంఠం కాంప్లెక్స్ పూర్తిగా భక్తులతో నిండిపోవడంతో రాత్రి 11 గంటలలోపు వారందరికీ దర్శనం కల్పించేందుకు టీటీడీ అధికారులు ఈ చర్యలు చేపట్టారు. కాగా సూర్యగ్రహణం కారణంగా
గురువారం ఉదయం వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దుచేసింది. గురువారం ఉదయం 8.08 గంటల నుంచి 11.16 గంటల వరకు సూర్యగ్రహణ కాలం ఉంటుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం 6 గంటలు ముందుగా శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి 11 గంటలకు ఆలయం మూసివేశారు. కాగా బుధవారం తిరుమలకు చేరుకున్న భక్తులకు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం శుద్ధి అనంతరం వైకుంఠం కాంప్లెక్స్‌కు అనుమతిస్తారు. కాగా బుధవారం రాత్రి 10గంటల నుంచి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదాల కాంప్లెక్స్ తలుపులను కూడా మూసివేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద భవనాన్ని తెరచి వంట శాలను శుద్ధిచేసి మధ్యాహ్నం 2 గంటలకు అన్నప్రసాద వితరణ ప్రారంభిస్తారు. కాగా సూర్యగ్రహణం కారణంగా గురువారం శ్రీవారి ఆలయంలో నిర్వహించే తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవ సేవలను కూడా టీటీడీ రద్దుచేసింది.
8. సూర్యగ్రహణం కారణంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని బుధవారం రాత్రి 9:30 గంటలకు ద్వారబంధనం చేసి మూసివేశారు. తిరిగి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, పుణ్యాహవచనం, మహానివేదన అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనాలు కల్పించనున్నారు. సూర్యగ్రహణం సందర్భంగా నేడు ఉదయం ఆలయంలో నిర్వహించే అభిషేకాలు, అర్చనలు, నిత్య హోమాలు, నిత్య కల్యాణోత్సవాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు నిలిపివేయనున్నారు. ఆలయ సంప్రోక్షణ పిదపనే మధ్యాహ్నం 2 గంటల నుండి రోజువారీ ఆలయ కార్యకలాపాలు, వ్రతాలు నిర్వహించనున్నారు.
9. తిరుమల \|/ సమాచారం *
ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రోజు గురువారం,
26.12.2019
ఉదయం 6 గంటల
సమయానికి,
తిరుమల: 16C°-25℃°
• నిన్న 64,818 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్
లోకి భక్తులను 12 గం
తరువాత అనుమతిస్తారు
సర్వదర్శనం కోసం భక్తులు
బైట వేచి ఉన్నారు,
• సూర్యగ్రహనం కారణంగా
శ్రీవారి సర్వదర్శనం
మ: 2 గం! తరువాత,
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3.73 కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
• ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
/ / గమనిక / /
జ‌న‌వ‌రి 1, వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా
• రద్దీని దృష్టిలో ఉంచుకుని
దాత‌ల‌కు, చంటిపిల్ల‌ల
త‌ల్లిదండ్రుల‌కు, వృద్ధులు,
దివ్యాంగులకు ప్ర‌త్యేక
ద‌ర్శ‌నాలను నిలుపుద‌ల
చేయ‌డ‌మైన‌ది.
• నూతన ఆంగ్ల
సంవత్సరాది సంద‌ర్భంగా
డిసెంబరు 30 నుండి
జనవరి 1వ తేదీ వరకు,
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి
సందర్భంగా జనవరి 4
నుండి 7వ తేదీ వరకు
దాతలకు ప్రత్యేక
దర్శనాలు, గదుల
కేటాయింపును
నిలిపివేయ‌డ‌మైన‌ది.
• భక్తుల రద్దీ నేపథ్యంలో
నూతన ఆంగ్ల
సంవత్సరాది సందర్భంగా
డిసెంబరు 31, జనవరి
1వ తేదీల్లో, వైకుంఠ
ఏకాదశి, ద్వాదశి
సందర్భంగా జనవరి 5
నుండి 7వ తేదీ వరకు
వృద్ధులు, దివ్యాంగులు,
చంటిపిల్లల తల్లిదండ్రుల
ప్రత్యేక దర్శనాలు ర‌ద్దు
చేయ‌డ‌మైన‌ది.
ఈనెల తిరుమలలో
ప్రత్యేక ఉత్సవాలు
• నేడు సూర్య‌గ్ర‌హ‌ణం.
• 31 న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, తిరుప్పావై
ధనుర్మాసం కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు. ధనుర్మాసం ఉభయ సంధ్యల్లో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం తొలగి అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు. దీన్నే బాలభోగం అంటారు. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకూ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది.ttd Toll free #18004254141తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంకోసం క్రింద లింకు ద్వారా చేరండిhttps://t.me/joinchat/AAAAAEHgDpvZ6NI-F2C7SQ
10. చరిత్రలో ఈ రోజు డిసెంబర్, 26
సంఘటనలు
1907: భారత జాతీయ కాంగ్రెస్‌ 23వ మహాసభలో పార్టీ సభ్యులు అతివాద, మితవాద వర్గాలుగా చీలిపోయారు. అతివాద వర్గానికి బాలగంగాధర తిలక్‌, మితవాదులకు గోపాలకృష్ణ గోఖలే నాయకత్వం వహించారు.
1982: టైమ్‌ మ్యాగజైన్‌ ఏటా ఇచ్చే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారాన్ని ఆ ఏడాది ‘పర్సనల్‌ కంప్యూటర్‌’కు ఇచ్చింది. మనిషికి కాకుండా ఆ గౌరవాన్ని ఒక యంత్రానికి ప్రకటించడం అదే మొదటిసారి.
2004: హిందూ మహాసముద్రంలో వచ్చిన పెను భూకంపం కారణంగా సునామి వచ్చింది. వివిధ దేశాల్లో సునామి సృష్టించిన విధ్వంసంలో దాదాపు 2,75,000 మంది వరకు చనిపోయారు.
2009: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నారాయణ్ దత్ తివారీ పదవికి రాజీనామా సమర్పించాడు.
జననాలు
1893: మావో జెడాంగ్, చైనాలో కమ్యూనిష్టు నాయకుడు.
1899: ఉద్దమ్ సింగ్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు.
1914: మరళీధర్ దేవదాస్ ఆమ్టే, సంఘసేవకుడు. (మ.2008)
1915: జూపూడి యజ్ఞనారాయణ, ప్రముఖ న్యాయవాది, రాజకీయవేత్త మరియు కళాకారుడు
1935 : వెస్ట్‌ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు రోహన్ కన్హాయ్ జననం.
మరణాలు
1986: అంట్యాకుల పైడిరాజు ప్రముఖ చిత్రకారుడు మరియు శిల్పి. (జ.1919)
1981: కొమ్మారెడ్డి సావిత్రి, తెలుగు సినీ ప్రపంచంలో మహానటి. (జ.1936)
1988: ప్రముఖ కాపు నాయకుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే,వంగవీటి మోహనరంగా
1999 : ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోదుడు మరియు పండితుడు భారత 9 వ రాష్ట్రపతి శంకర దయాళ్ శర్మ మరణం.
2010: ఏ.వి.సుబ్బారావు, తెలుగు రంగస్థల నటుడు మరియు పద్య గాయకుడు. (జ.1930)
2018: తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాహితీవేత్త, రచయిత మరియు బహుబాషావేత్త నోముల సత్యనారాయణ.
పండుగలు మరియు జాతీయ దినాలు- జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం.
బాక్సింగ్ డే.
11. సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పలు ఆలయాలను అర్చకులు మూసివేశారు. గ్రహణం వీడిన తర్వాత శుద్ధి అనంతరం ఆలయాలు తెరుచుకోనున్నాయి. ఈ రోజు ఉదయం 7.59 గంటలకు ప్రారంభమైన సూర్యగ్రహణం మధ్యాహ్నం 12:30 గంటలకు ముగియనుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం మధ్యాహ్నం 12 గంటల వరకు మూసివేయనున్నారు. తిరిగి మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత భక్తులకు సర్వదర్శనాన్ని కల్పించనున్నారు. సూర్యగ్రహణం సందర్భంగా ఆర్జిత సేవలు టీటీడీ రద్దు చేసింది. అలాగే కాణిపాకం ఆలయం మధ్యాహ్నం 12 గంటలకు తెరుచుకోనుంది.
12.అటు యాదాద్రి ఆలయాన్ని మధ్యాహ్నం 12 గంటల వరకు మూసివేయనున్నారు. సంప్రోక్షణ తర్వత మధ్యాహ్నం 2 గంటలకు ఆలయం తెరుచుకోనుంది. బాసర సరస్వతి ఆలయం ఉదయం 11.30 గంటలకు తెరుచుకోనుంది. సంప్రోక్షణ అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. అన్నవరం ఆలయాన్ని మధ్యాహ్నం 3 గంటల వరకు మూసివేయనున్నారు.
13.ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ గుడిని సాయంత్రం 5 గంటల వరకు మూసివేయనున్నారు. ఆలయ శుద్ధి అనంతరం భక్తులను అనుమతించనున్నారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం మూసివేసిన అధికారులు సంప్రోక్షణ తర్వాత సాయంత్రం 3.30 గంటలకు భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు. సింహాద్రి అప్పన్న ఆలయాన్ని అర్చకులు మూసివేశారు. సాయంత్రం 4 గంటలకు అప్పన్న దర్శనానికి భక్తులకు అనుమతివ్వనున్నారు. శ్రీశైలం ఆలయంలో 11.30 గంటలకు మహాసంప్రోక్షణ జరుగనుంది.
14. ముగిసిన సూర్యగ్రహణం.. ఆలయాల్లో సంప్రోక్షణ
ఇవాళ ఉదయం 8:08 గంటలకు ప్రారంభమైన సూర్య గ్రహణం 11:11 గంటలకు ముగిసింది. సూర్యగ్రహణాన్ని ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. ఢిల్లీలోని తన నివాసంలో గ్రహణాన్ని వీక్షించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించినప్పటికీ.. మబ్బుల వల్ల సూరగ్రహణాన్ని చూడలేకపోయారు. కానీ కేరళలోని కోజికోడ్‌ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా గ్రహణం దృశ్యాలను చూసినట్లు మోదీ తెలిపారు. సూర్యగ్రహణం ముగిసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో అర్చకులు సంప్రోక్షణ చర్యలు చేపట్టారు. ఆలయాల శుద్ధి అనంతరం దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు. ఇక జనాలు తమ నివాసాలను కూడా శుద్ధి చేసుకుంటున్నారు. భారత్‌తో పాటు సౌదీ అరేబియా, ఖతార్‌, యూఏఈ, ఒమన్‌, శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్‌, మరియానా దీవులు, గువామ్‌లో పాక్షిక సూర్యగ్రహణం దర్శనమిచ్చింది.
15. వచ్చే ఏడాది చివర్లో యాదాద్రి ప్రారంభం!
వచ్చే ఏడాది చివరలో యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవం ఉంటుందని, ఈ లోపు ప్రధాన ఆలయంతోపాటు ఇతర పనులన్నీ పూర్తి చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి. ముందుగా అనుకున్నట్టు ఫిబ్రవరిలో ప్రారంభోత్సవం ఉండదని స్పష్టం చేశాయి. పనులన్నీ పూర్తి కావడానికి 10 నుంచి 12 నెలల సమయం పట్టొచ్చని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ‘యాదాద్రి పనులను చూశాక సీఎం కేసీఆర్ ఆలయ ప్రారంభానికి తొందరపడొద్దని చెప్పారు. హడావుడిగా పనులు చెయొద్దని, అన్నీ సక్రమంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆలస్యమైనా పర్లేదు కానీ మాట రావొద్దన్నారు. అందుకని అన్ని పనులు అయ్యాకనే ముహూర్తం ఉంటుంది. అది 2020 డిసెంబర్ లో ఉండొచ్చు’అని ఆయన తెలిపారు. ప్రధాన ఆలయం పనులు దాదాపుగా ముగింపు దశలో ఉన్నాయని, అవి పూర్తికాగానే మిగతా పనులపై దృష్టి పెడతామని చెప్పారు.