రాజధానిగా అమరావతే కొనసాగుతుంది అనే మాట సీఎం జగన్ నోట వచ్చే వరకూ తమ ఆందోళనలు కొనసాగుతాయని రాజధాని ప్రాంత రైతులు స్పష్టం చేశారు. అంతవరకు మందడంలో మహాధర్నా, వెలగపూడిలో రిలే నిరాహారదీక్షలు కొనసాగిస్తామని.. మిగతా గ్రామాల్లోనూ నిరసనలు తెలుపుతారని రైతులు తేల్చిచెప్పారు. మరోవైపు మూడు రాజధానులు ఉండొచ్చంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు, జీఎన్ రావు కమిటీ సిఫార్సులకు నిరసనగా అమరావతి ప్రాంత రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు తుళ్లూరులో మహాధర్నా, వంటావార్పు కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్థానిక రైతు సంఘ నాయకులు తెలిపారు. వేలాదిగా రైతులు, రైతు కూలీలు, మహిళలు, యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
మాకు జగనే చెప్పాలి-రాజధాని రైతులు
Related tags :