Movies

పిల్లి-చేప-డేట్

Cat Fish Radhika Apte Date-Telugu Movies News

వయసులో తనకంటే చిన్నవాడితో తాను ఎప్పుడూ డేట్‌కు వెళ్లలేదని తెలిపారు నటి రాధికా ఆప్టే. దక్షిణాది చిత్రాలతోపాటు, పలు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఆమె నెట్‌ప్లిక్స్‌లో ప్రసారమయ్యే ఓ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి తన ప్రైవేటు లైఫ్‌కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియచేశారు. ఇందులో భాగంగా తన భర్తతో మొదటిసారి డేట్‌కు వెళ్లడానికి గల కారణాన్ని కూడా ఆమె చెప్పారు.‘‘వయసులో నాకంటే చిన్నవాడితో నేను ఎప్పడూ డేట్‌కు వెళ్లలేదు. నాకు ఇప్పటికీ బాగా గుర్తు ఒకానొక సమయంలో ఇద్దరు అబ్బాయిలు నన్ను డేట్‌కు రమ్మని పిలిచారు. అందులో ఒకతను నాకంటే వయసులో చిన్నవాడు. వాళ్లిద్దరు డేట్‌కు రమ్మంది ఒకే రోజు. ఒకే సమయం. నాకేం చేయాలో తెలియదు. అప్పుడు మా ఇంటికి ప్రతిరోజూ ఒక పిల్లి వస్తుండేది. దానికి నేను ఓ చేప పిల్లను ఆహారంగా అందించేదాన్ని. వాళ్లు డేట్‌కు రమ్మని అడిగినప్పుడు.. ఇంటికి వెళ్లి పిల్లికి చేపను ఆహారంగా అందించాను. ఒకవేళ అది చేపను తింటే ఒక అబ్బాయితో.. తినకపోతే నాకంటే చిన్నవాడితో వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఆరోజు ఆ పిల్లి చేపను తింది. అలా నేను ఒకబ్బాయితో డేట్‌కు వెళ్లాను. తర్వాత అతన్నే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అతనే నా భర్త బెనిడిక్ట్‌.’’ అని రాధిక తెలిపారు.