క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధుల నివారణకు ‘ఉపవాసం’ అద్భుత సాధనంలా పనికొస్తుందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. రోజులో ఆరగించే ఆహారాన్ని కేవలం 6 గంటల వ్యవధిలోనే తీసుకొని.. మిగతా 18 గంటలపాటు ఉపవాసం పాటించడం ద్వారా మనుషులు ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు పొందవచ్చునని నిర్ధారించింది. గుండె ఆరోగ్యం మెరుగుదల, రక్తపోటు నియంత్రణ, బరువు తగ్గుదల, జ్ఞాపకశక్తి, ఆయుర్దాయం పెరుగుదలకు ఈ విధానం దోహదపడుతుందని వెల్లడించింది. అమెరికాలోని జాన్స్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మార్క్ మ్యాట్‌సన్ నేతృత్వంలోని పరిశోధకులు తాజా అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ తరహా ఉపవాసాన్ని పాటించడం తొలినాళ్లలో చాలా కష్టంగా ఉంటుందని తెలిపారు. 18 గంటలపాటు ఏమీ తినకుండా ఉంటే వ్యక్తుల్లో ఆకలి బాగా పెరిగిపోతుందని.. ఫలితంగా చేసే పనులపై సరిగా దృష్టిసారించలేకపోయే ముప్పుందని పేర్కొన్నారు.
18గంటల ఉపవాసం గురించి విన్నారా?
Related tags :