ప్రపంచ కాలుష్యకారక నగరాలన్ని దాదాపుగా భారత్‌లోనే ఉన్నాయి. అత్యంత కాలుష్య 15 నగారల్లో భారత్ నుంచి 12 నగరాలు ఉన్నాయి. టాప్ 10లోనే ఎనిమిది నగరాలు ఉన్నాయి. ఇక ప్రథమ, ద్వితియ స్థానాల్లో భారత నగరాలే ఉన్నాయి. వరల్డ్ ఇండెక్స్ విడుదల చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అత్యంత కాలుష్య నగరాల్ జాబితాలో భారత రాజధాని సహా సమీప నగరాలు పోటీ పడ్డాయి. తొలి ఆరు స్థానాలకు గాను నాలుగు స్థానాల్లో ఢిల్లీ సమీపంలోని నగరాలే ఉన్నాయి. అయితే ఢిల్లీ టాప్ 10 తర్వాతి స్థానంలో ఉండడం గమనార్హం. కాగా ఈ లిస్టులో ఉన్న మరో మూడు నగరాలు మన పొరుగు దేశాలకే చెందినవి కావడం ఆశ్చర్యమేమీ కాదు. ఇందులో రెండు నగరాలు పాకిస్తాన్‌కు చెందినవి కాగా ఒక నగరం చైనాకు సంబంధించింది. ప్రపంచంలో అత్యంత కాలుష్యకారక నగరాలు.. వరల్డ్ ఇండెక్స్ సర్వే ప్రకారం: గురుగ్రామ్ ఘజియాబాద్ ఫైసలాబాద్ (పాకిస్తాన్) ఫరిదాబాద్ భివండి నోయిడా పాట్న హోటన్ (చైనా) లఖ్‌నవూ లహోర్ (పాకిస్తాన్) ఢిల్లీ జోద్‌పూర్ ముజఫర్‌పూర్ వారణాసి మొరాదాబాద్.
15 అత్యంతకాలుష్య నగరాల్లో 12 మనవే
Related tags :