ScienceAndTech

2020 గురించి హెచ్చరిక

New Date Writing Warning In 2020 Is Becoming Viral

ఇంకో నాలుగు రోజుల్లో 2020 వస్తోంది. విజన్ 2020, లీడ్ ఇండియా 2020.. గత రెండు దశాబ్దాలుగా.. ఈ మాటలు వినని తెలుగోడు, భారతీయుడు ఉండడనడంలో అతిశయోక్తి లేదు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటల్లో కానీ… ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటల్లో కానీ.. ఈ పదాలు ఎక్కువగా వినపడేవి. వ్యక్తిగత, సామాజిక అభివృద్ధి నేపథ్యంలో ఈ నినాదాలు ముందుకు వచ్చాయన్న విషయం తెలిసిందే. ఎంతో మంది ఉత్సాహంగా ఎదురు చూస్తున్న.. 2020పై ఓ ఆసక్తికర వార్త…వాట్సాప్‌లలో విపరీతంగా షేర్ అవుతోంది. కొత్త సంవత్సరంలో తేదీ రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనేది దాని సారాంశం.వివరాల్లోకి వెళితే.. జనవరి నుంచి తేదీలు 01/01/2020గా ప్రారంభమవుతాయన్న విషయం తెలిసిందే. అయితే చాలా మంది అలవాటుగా 01/01/20 అని రాసే అవకాశం ఉంటుంది. దీనివల్ల అది 01/01/2000 నుంచి 01/01/2099 వరకు ఏదైనా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒప్పందాల విషయంలో.. ఇతర కాంట్రాక్టుల విషయంలో.. చెక్‌ల విషయంలో జరగడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. దీనివల్ల మోసపోయే ఛాన్సులు చాలా ఉన్నాయని ఆ మెసేజ్ తెలుపుతోంది. డేట్ రాసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలని చెబుతోంది. ఈ ఏడాదంతా ఆ విషయాన్ని గర్తుంచుకోవాలని సదరు వాట్సాప్ మెసేజ్ హెచ్చరిస్తోంది. ‌