Movies

“సారా” మత్తు

Sarah Alikhan Tour Pics Are Shaking Netizens And Internet

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ గారాలపట్టి సారా అలీఖాన్‌కు సోషల్‌ మీడియాలో ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఖాతా తెరచిన కొన్ని రోజులకే 20 లక్షల మందికి పైగా ఆమెను ఫాలో అయ్యారంటే యూత్‌లో ఆమెకు ఏ రేంజ్‌ ఫాలోయింగ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా సారా స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. అక్కడ సముద్రం తీరాన బికినీలో హాట్‌హాట్‌గా దిగిన ఫొటోలను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.ఆ ఫొటోలు చూసి కుర్రకారు కవిత్వాలు రాశారు. కామెంట్లూ మొదలుపెట్టారు. ‘నీ అందాలతో చంపేసేలా ఉన్నావే’ అని ఒక నెటిజన్‌ కామెంట్‌ చేస్తే, ‘ఈ భూమ్మీద నీ అంత సెక్సియస్ట్‌ అమ్మాయి లేదు’ అంటూ మరో అభిమాని ఆమె అందాన్ని వర్ణిస్తూ కామెంట్‌ చేశారు. సారా యాక్ట్‌ చేసింది రెండు సినిమాల్లోనే. అయినా స్టార్‌ హీరోయిన్‌కు ఉండాల్సినంత క్రేజ్‌ ఆమెకు ఉంది. ప్రస్తుతం సారా ‘కూలీ నం.1’ చిత్రంతోపాటు ఇంతియాజ్‌ అలీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.