మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డిలో ఆకస్మికంగా పర్యటించారు. కందిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన మంత్రి.. కాసేపు ఉపాధ్యాయుడి అవతారమెత్తారు. పదో తరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు తెలుగులో సరిగా పేర్లు రాయలేకపోవడం, ఎక్కాలు కూడా చెప్పలేకపోవడంతో ఉపాధ్యాయుల బోధన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. పదో ఎక్కం రాకపోతే విద్యార్థులు పది ఎలా పాసవుతారు?ఈ పోటీ ప్రపంచంతో ఎలా పోటీ పడతారని అని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. పాఠశాలలో ఏం నేర్పిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం కంది శివారులో నూతనంగా నిర్మిస్తున్న తెరాస జిల్లా కార్యాలయ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. భవనాన్ని మరింత నాణ్యంగా నిర్మించాలని గుత్తేదారులకు సూచించారు. ఇటీవల మంత్రి హరీశ్ రావు తూప్రాన్ పురపాలిక పరిధి అల్లాపూర్‌లోని గురుకుల పాఠశాలలో నిర్మించిన ధ్యాన మందిరం, అటల్ టింకరింగ్ ప్రయోగశాలను ప్రారంభించి విద్యార్థులతో మాట్లాడారు. పలువురు పదో తరగతి విద్యార్థులను మంత్రి పిలిచి ప్రిన్సిపల్ దత్తాత్రేయశర్మ పేరును తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో రాసి చూపాలని.. అదేవిధంగా 7, 13, 17వ ఎక్కాలను చెప్పాలని అడిగారు. వారు రాయలేకపోయారు.. చెప్పలేకపోయారు. దీంతో మంత్రి ఉపాధ్యాయులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
పదో ఎక్కం…ఆంగ్లంలో పేర్లు రాయలేకపోయిన తెలంగాణా టీచర్లు
Related tags :