ఇలా చేస్తే.. కట్ చేసిన పండ్లు రంగు మారవు! కొన్ని పండ్లు బయటకు ఎంత తాజాగా కనిపించినా.. వాటిని కట్ చేసినప్పుడు రంగు మారిపోతాయి. అలా కాకూడదంటే ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.యాపిల్ పండును కోసినప్పుడు స్మూత్‌గా, ఆకర్షనీయంగా ఉంటుంది. అయితే, కోసిన కొద్ది సేపటికే అది రంగు మారిపోతుంది. దీంతో వాటిని అతిథులకు పెట్టాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కేవలం యాపిల్ మాత్రమే కాదు.. మరికొన్ని పండ్లతో కూడా ఇదే సమస్య. ఆక్సిడేషన్ ప్రక్రియ వల్ల పండ్లు ఈ విధంగా రంగు మారిపోతాయి. అయితే, ఈ సమస్యకు పరిష్కారం మా వద్ద ఉంది. అదేమిటో చూడండి.
నీటిలో ఉంచి కట్ చేయాలి:కుళాయిని విప్పి.. నీటి మధ్యలో పండ్లను ఉంచి కోసినట్లయితే ఆక్సిడేషన్ ప్రక్రియను ఆపవచ్చు. దీనివల్ల పండ్లు బ్రౌన్ రంగులోకి మారకుండా తాజాగా కనిపిస్తాయి.
అల్లం ద్రావణంలో వేయండి. కట్ చేసిన పండ్లను అల్లం ద్రావణం (జింజర్ అలే)లో వేసినట్లయితే రంగు మారకుండా ఫ్రెష్‌గా కనిపిస్తాయి. అల్లంలో ఉండే సెట్రిక్ యాసిడ్ ఆక్సిడేషన్ ప్రక్రియను నిలిపివేస్తుంది.
ఉప్పు నీటిలో పెట్టండి: ఇది అన్నింటికంటే సులభమైన ప్రక్రియ. ఒక బౌల్‌లో అర టీస్పూన్ ఉప్పు కలిపండి. అందులో కోసిన పండ్ల ముక్కలను వేయండి. రెండు నిమిషాలపాటు ఉంచి తీయండి. దీనివల్ల పండ్లు బ్రౌన్ రంగులోకి మారకుండా తాజాగా కనిపిస్తాయి.
ఆస్కార్బిక్ ఆమ్లం: ఆస్కార్బిక్ ఆమ్లంలో విటమిన్-సి ఉంటుంది. ఈ యాసిడ్ ఫుడ్‌స్టోర్‌లో కూడా కనిపిస్తుంది. ఈ యాసిడ్ నీటిలో సులభంగా కరిగి పండ్లను రంగు మారకుండా అడ్డుకుంటుంది.
హనీ వాటర్ బాత్.తేనె నీటి ద్వారా కూడా పండ్ల రంగు మారకుండా అరికట్టవచ్చు. గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి కలపండి. అందులో పండ్ల ముక్కలను వేసి.. 30 సెకన్ల తర్వాత బయటకు తీయండి. ఇలా చేస్తే సుమారు 8 గంటల వరకు పండ్లు ముక్కలు రంగు మారకుండా తాజాగా కనిపిస్తాయి.
సిట్రస్ జ్యూస్. కాస్తంత నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసం వేసి కలపండి. అందులో పండ్ల ముక్కలు వేసి తీసినట్లయితే రంగు మారకుండా ఫ్రెష్‌గా ఉంటాయి. పైనాపిల్ లేదా ఆరెంజ్ జ్యూస్‌లో కూడా సెట్రస్ ఉంటుంది. నిమ్మ రసం అందుబాటులో లేకపోతే వాటిని ఉపయోగించవచ్చు.