ప్రవాస భారతీయులు (ఎన్నారై) తమ పాన్ కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానించటం తప్పనిసరి. ఈ అనుసంధానానికి డిసెంబరు 31 ఆఖరు తేదీ. గడువులోగా అనుసంధానం చేయని పాన్‌కార్డులు చెల్లుబాటు కావని సంబంధిత అధికారులు వెల్లడించారు. నిజానికి ప్రవాస భారతీయులకు ఆధార్ కార్డు, పాన్ కార్డు తప్పనిసరి కాదు. అయితే ఆ రెండు కలిగి ఉన్న వారు మాత్రం డిసెంబర్ 31లోగా తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలి. స్వదేశంలో ఆర్థిక లావాదేవీలు చేయాలనుకునే ఎన్నారైలకు ఈ రెండు పత్రాలు అవసరం. ఈ అనుసంధానికి సెప్టెంబర్ 30గా ఉన్న గడువును గతంలో డిసెంబర్ 31 వరకూ పొడిగించారు.
ఆధార్-పాన్ అనుసంధానానికి 31 ఆఖరు తేదీ
Related tags :