తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం ముగిసింది. తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ధర్మకర్తల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గొల్లమండపం మార్చేది లేదని స్పష్టం చేసింది.
ధర్మకర్తల మండలి నిర్ణయాలివే…
* తితిదే గౌరవ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితుల నియామకం.
* వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠ దర్శనం.
* జమ్ము కశ్మీర్, వారణాసిలో వేంకటేశ్వరస్వామి గుడి నిర్మించే యోచన.
* ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం రూ.30కోట్లు మంజూరు.
* బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్‌గా మదన్ మోహన్‌రెడ్డి నియామకం.
* సంక్రాంతిలోపు తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం దిశగా కార్యాచరణ.
కాశ్మీర్‌లో వెంకన్న గుడి
Related tags :