Agriculture

అర్ధరాత్రి రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు

Amaravati Farmers Taken Into Custody By Police

అర్ధరాత్రి దాటాక పోలీసులు కొందరిని అరెస్టు చేసి తీసుకెళ్లారని రాజధాని రైతులు చెప్పారు.

రాత్రి 3 గంటల సమయంలో తమ ఇళ్లలో తనిఖీలు చేశారని.. వెంకటపాలెం, మోదుగుల లింగాయపాలెంలో అక్రమ అరెస్టులు చేశారని తెలిపారు.

మందడం, వెలగపూడి, తుళ్లూరులో అనేకమందిని అదుపులోకి తీసుకున్నారన్నారు.

అరెస్టు చేసినవారిని వెంటనే విడిచిపెట్టకుంటే పోలీస్ స్టేషన్​ల ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.

ఉద్యమాన్ని అణచివేసే కుట్రలో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.