మూడు రాజధానులపై మాజీ కేంద్రమంత్రి అశోకగజపతి రాజు ఫైర్
చరిత్రలో మొఘలలు, తర్వాత మహమ్మద్ బీన్ తుగ్లక్ తరచూ రాజధానులు మార్చేవారు.
ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తింది
రాష్ట్రాన్ని విభజసించి నప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు
నాడు అమరావతిలో రాజధాని పెడదామంటే ఊ కొట్టిన నేటి ముఖ్యమంత్రి…ఇప్పుడు రోజుకో చోట రాజధాని పెడతానంటూ చెబుతున్నారు
33 వేల ఎకరాల భూములు త్యాగం చేసిన రైతుల పరిస్థితి ఏమిటీ?
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసేకరణ చేశారు
ఎవరు అడిగితే వారికి రాజధాని ఇచ్చేస్తారా?
నెలకో రాజధాని పెట్టమనండి
అప్పుడు కూడా ఫిబ్రవరి నెలలో 28 రోజులే ఉన్నానయని గొడవ మొదలవుతుంది
నాడు ఈ నేతలు అధికారంలో ఉన్నప్పుడే విజయనగరంలో కర్ఫ్యూ వచ్చింది
ఇప్పుడు అమరావతిలోనూ అదే పరిస్థితి తలెత్తింది
ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్ళాన్ని అనుకుంటోందో.