ScienceAndTech

వాట్సాప్ QR కోడ్లు స్కాన్ చేయకండి

Do Not Scan WhatsApp QR Codes-Telugu SciTech News

సైబర్​ నేరగాళ్లు ముదిరిపోతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం మెండుగా ఉన్న వీరు.. మూసపద్ధతులను పక్కనపెట్టి వినూత్న మార్గాలను అనుసరిస్తున్నారు.

అత్యంత చాకచక్యంగా మీతో మిమ్మల్నే మోసగిస్తున్నారు.

వాట్సాప్​లో మాయాజాలం

ఆన్​లైన్​లో తమ వస్తువులు అమ్మేవారిని సైబర్​ నేరగాళ్లు లక్ష్యం చేసుకుంటున్నారు.

మొదటగా మీ వస్తువు వారికి బాగా నచ్చిందని, కొనడానికి సిద్ధంగా ఉన్నామని నమ్మబలుకుతారు.

అమ్మకానికి పెట్టినవారు తమ వస్తువులు త్వరగా అమ్ముడుపోతున్నాయనే ఉత్సాహంలో నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటారు.

డబ్బులు పంపిస్తామని..

తరువాత సైబర్​ నేరగాళ్లు డబ్బులు పంపిస్తామని నమ్మకంగా చెబుతారు.

మీ బ్యాంకు ఖాతా వివరాలు, మీ వాట్సాప్ నెంబర్​ అడుగుతారు.

మీరిచ్చిన వివరాలు తీసుకున్న తరువాత.. మీ వాట్సాప్ ఖాతాకు ఓ క్యూఆర్​ కోడ్ పంపిస్తారు.

దీనిని స్కాన్​ చేస్తే నగదు మీ ఖాతాలో పడుతుందని చెబుతారు.

నిజానికి వారు పంపే క్యూఆర్​ కోడ్​ మీ నుంచి నగదు అభ్యర్థిస్తూ పంపించే కోడ్​.

పొరపాటున దానిని స్కాన్ చేసారో.. మీ ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యి వారి ఖాతాలో పడపోతుంది. అంతే మీ డబ్బు ఢమాల్​ అవుతుంది.

తస్మాత్​ జాగ్రత్త

వాట్సాప్ ద్వారా జరిగే ఇలాంటి మోసాల పట్ల అవగాహన అవసరం.

అందుకే క్యూఆర్ కోడ్​లను స్కాన్ చేసేముందు సెండ్ మనీ, రిక్వెస్ట్ మనీలకు మధ్య ఉండే తేడా గమనించాలి.

‘సెండ్ మనీ’ అంటే మీ ఖాతాలో నగదు జమ చేస్తున్నట్లు; ‘రిక్వెస్ట్ మనీ’ అంటే మీ ఖాతా నుంచి నగదు అభ్యర్థిస్తున్నట్లు.

మీరు పొరపాటున వారి ట్రాప్​లో పడ్డారంటే మీ ఖాతా నగదు మాయమయినట్లే.

‘క్యూఆర్​ కోడ్’ అనేది అంతర్జాలంలో లభించే వెబ్​పేజ్​ తరహా లింక్​. దీనిని ఎవరైనా సులభంగా క్రియేట్ చేయవచ్చు.

కనుక మనకు అవగాహన లేని ఇలాంటి లింక్​ల జోలికి, క్యూఆర్ కోడ్​ల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం