పిల్లలు కావాలని చాలా మంది ఆరాటపడతారు. అందుకోసం ఎదురు చూస్తారు. వివాహం అయిన వెంటనే తమ ఇంట్లో చిన్నారులు ఆటలాడాలని కోరుకుంటారు. మరి ఒంటరి మహిళల పరిస్థితి ఏంటి. వారు కూడా పిల్లల్ని కంటున్నారు. అదేలా అంటే ఐవీఎఫ్ పద్ధతితో బ్రిటన్‌లో ఇదొక ట్రెండ్‌గా మారింది.
ఇటివల కాలంలో చాలామంది ఒంటరి మహిళలు తల్లి కావాలనే తమ కోరికను నిజం చేసుకుంటున్నారు. ఇందుకు ఐవీఎఫ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇప్పటికే ఈ సంస్కృతి బ్రిటన్‌లో విస్తరిస్తున్నది. యూకేకు చెందిన హ్యూమన్ ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియాలజీ అథారిటీ లెక్కల ప్రకారం.. ఐవీఎఫ్ ద్వారా తల్లులుగా మారుతున్న మహిళల సంఖ్య 2014 నుంచి 35 శాతం మేర పెరిగింది. దీనికి కారణం ప్రతీ ఒక్కరికీ ఈ విషయంలో అవగాహన పెరగడం, తమకు నచ్చని భాగస్వామితో పిల్లల్ని కనడం ఇష్టం లేని వారు ఈ పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. ఐవీఎఫ్ అనేది అంత సులభం ఏమీ కాదు. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. పూర్తవడానికి దాదాపు 15 రోజులైనా పడుతుంది. ఇంత సమయం తీసుకున్నా.. ఇది కచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పడం కష్టం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఐవీఎఫ్ చేయించుకున్నవారి శరీరతత్వం ట్రీట్‌మెంట్‌కి సహకరిస్తుందా? లేదా? అన్నది కూడా సక్సెస్ రేటుపై ఆధారపడి ఉంటుంది. అంతేకాదు ఖర్చుతో కూడుకున్న పని. భారత్‌లో ఈ సంస్కృతి విస్తరించడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ పరిస్థితులు ఐవీఎఫ్‌ని ఎంచుకునేందుకు కారణాలుగా మారుతున్నాయి. గతేడాది మోదీ ప్రభుత్వం ఓ బిల్లును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఒంటరి వ్యక్తులు సరోగసి ద్వారా పిల్లల్ని కనడానికి వీల్లేదు. భారతీయ చట్టం ప్రకారం వివాహం చేసుకున్న వాళ్లు ఈ చికిత్సను ఎంచుకోవచ్చు. భారత్‌కు చెందిన కొందరు సెలబ్రిటీలు ఇప్పటికే ఈ విధానంతో పిల్లల్ని కన్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు తాము సరోగసీతో పిల్లల్ని కన్నట్లుగా అంగీకరించారు కూడా. అందులో మంచు లక్ష్మీ, కరణ్ జోహార్, తుషార్ కపూర్ వంటి సినీ ప్రముఖులు ఉన్నారు.