సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో 24న సెంగ్ కాంగ్ ప్రాంతంలో హరినాథ్ రెడ్డిచే *Valmiki Ramayana in Real Life* ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. రామాయణంలోని బాలకాండ, అయోధ్య కాండ, సుందర కాండ లోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలు, శ్లోకాలు కీర్తిస్తూ, వాటి సారాంశం తెలియజేయటంతో పాటు, అవి మన దైనందిక జీవితంలో ఎంత ప్రాముఖ్యతని సంతరించుకున్నాయో కూడా సవివరంగా తెలియచేశారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో పరిస్థితుల దృష్ట్యా, ప్రతి ఒక్కరు రామాయణం గురించి తెలుసుకోవాలని, సీతారాములు అవలంబించిన జీవనశైలి వల్లనే యుగాలు గడిచినా ఇప్పటికీ వారు మన గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి, ఉపాధ్యక్షులు జ్యోతీశ్వర్ హరినాథ్‌రెడ్డిని సత్కరించారు.
సింగపూర్‌లో వాల్మీకి రామాయణ ప్రవచనం
Related tags :