* తాడేపల్లి శివాలయంలో చోరీ తెల్లవారుజామున హుండీ పగులగొట్టి పగలకొట్టి నగదు దోచుకెళ్ళిన గుర్తుతెలియని దుండగులు సుమారు 30 వేల రూపాయలు చోరీకి గురైనట్లు తెలిపిన ఆలయ పూజారి ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలిసులు.
* 2019 వార్షిక నివేదిక ను వివరించిన గౌతమ్ పోలీస్ శాఖ లో మార్పు కు శ్రీకారం చుట్టినాము.. సమర్ధవంతంగా పోలీస్ శాఖ పనిచేసింది.. వృత్తిపరమైన పోటీల్లో దేశ స్థాయిలో 7 అవార్డులు రాష్ట్రానికి వచ్చాయి. 2018 తో 2019 ను పోల్చితే కొన్ని కేసులు బాగా పెరిగాయి.. కొన్ని తగ్గు ముఖం పట్టాయి.. రోడ్డు ప్రమాదాలు దేశ సగటు కంటే రాష్ట్రంలో అధికం గా ఉండటం బాధాకరం పోలీస్ సంక్షేమం లో భాగంగా వీక్లీ ఆఫ్ చరిత్రాత్మకం రాష్ట్రంఆదర్శం గా నిలిచింది. ఇసుక పాలసీ వలన ఇసుక చోరీ కేసులు 140 శాతం పెరిగాయి. మహిళ భద్రత కోసం అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినం.. దిశ ఆక్ట్ కు ప్రభత్వం చర్య తీసుకోవడం అభినందనీయం మోసాలు, రపేలు, వేధింపులు, పోస్క కేసులు అధికామయ్యాయి.. సైబర్ నేరాలు 53 శాతం పెరిగాయి.
* అర్ధరాత్రి దాటాక పోలీసులు కొందరిని అరెస్టు చేసి తీసుకెళ్లారని రాజధాని రైతులు చెప్పారు. రాత్రి 3 గంటల సమయంలో తమ ఇళ్లలో తనిఖీలు చేశారని.. వెంకటపాలెం, మోదుగుల లింగాయపాలెంలో అక్రమ అరెస్టులు చేశారని తెలిపారు. మందడం, వెలగపూడి, తుళ్లూరులో అనేకమందిని అదుపులోకి తీసుకున్నారన్నారు. అరెస్టు చేసినవారిని వెంటనే విడిచిపెట్టకుంటే పోలీస్ స్టేషన్ల ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఉద్యమాన్ని అణచివేసే కుట్రలో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
* మార్కాపురం పెద్ద నీళ్ల ట్యాంకు వద్ద లారీ బైక్ ఢీ కొనడంతో యువకుడు మృతి.
* విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరిళ్లు దగ్ధం లక్ష వరకు ఆస్తి నష్ట. గుంటూరు జిల్లా సత్తెనపల్లి రూరల్. సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామ sc కాలనీ లో పుల్లగూర మార్తమ్మ ఆనందరావు దంపతుల పూరి గుడిసె రాత్రి 3 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా.
* ప్రకాశం జిల్లా చీరాల బండపాలెంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువ పత్రాలు లేని 14 ద్విచక్ర వాహనాలతో పాటు 5 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. 10 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.